జమ్మలమడుగు: మూడేళ్ల పరిపాలనలో ప్రజల జీవితాలను జగన్ రెడ్డి బుగ్గి పాలు చేశారని జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి విమర్శించారు. కొండాపురంలో టీడీపీ సభ్యత్వ నమోదు, గౌరవ సభ, బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. అన్ని వీధుల్లో పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి బాదుడే బాదుడు కరపత్రాలు పంపిణీ చేశారు. ఛార్జీల పెంపుతో అన్ని వర్గాల ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, విసనకర్రలు పంపిణీ చేశారు. యువకులు, మహిళలు, ప్రజలు ఉత్సాహవంతంగా సభ్యత్వం చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇందిరమ్మ, సీఎం సురేష్ రెడ్డి, గొరిశెట్టి బాబు, గిరీష్ నాథ్, తోట సాయి చరణ్, సుబ్రమణ్యం, కోనేటి ప్రసాద్, సృజన్ కుమార్, శివ, సత్య, రాము, అశోక్ సత్యరాజ్, ప్రతాప్, యల్లయ్య, ఐ టీడీపీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, నాగ శేఖర్, దేవరింటి విష్ణు ప్రసాద్ (బీసీ సెల్ అధ్యక్షుడు), కొండాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి అభిమానులు పాల్గొన్నారు.