ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు వేసిన పిటిషన్‌పై గురువారం విచా రణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో గత నెల 13వ తేదీన చంద్రబాబు సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయిం చారు. ఆ తర్వాత గత నెల 20వ తేదీన కూడా విచారణ జరిపిన సుప్రీంకోర్ట్ తదుపరి విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఫైబర్ నెట్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, అదుపులోకి తీసుకోవద్దని సిఐడి అధి కారులను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. కాగా చంద్ర బాబునాయుడుకు అవినీతి నిరోధక చట్టం 2018 లోని సెక్షన్ 17ఏ వర్తింపుపై సుప్రీంకోర్టు తీర్పు కోసం దేశ విదేశాల్లో ఆయన అభిమానులు పలు రోజులుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నా రు. ఈ కేసులో కొద్ది రోజుల క్రితం జరిగిన తుది రోజు విచారణ సందర్భంగా తమ తీర్పును నవం బర్ 9లోగా వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంకేతం ఇచ్చింది. నవంబర్ 9న ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ చేపడ తామని, అంతకుముందే 17ఏ పై తమ తీర్పును వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఫైబర్ నెట్ కేసుపై విచారణ గురువారం లిస్ట్ అయ్యింది. కానీ 17ఏ వర్తింపు కేసులో తీర్పు మాత్రం గురువారం రాత్రి 12 గంటల సమయం వరకు లిస్ట్ కాలేదు. సాధారణంగా ఆ రోజు జరప బోయే కేసుల విచారణ, వెల్లడిరచబోయే తీర్పుల వివరాలను ముందురోజే సుప్రీంకోర్ట్ లిస్ట్ చేస్తుంది.
కానీ ఈ లిస్ట్‌లో చంద్రబాబుకు 17వ వర్తింపుపై తీర్పు లేదు. కానీ చాలా అరుదైన సందర్భాల్లో అదే రోజు ఉదయం ఇరు పార్టీల వారు అందుబాటులో ఉంటే నోటీసు ఇచ్చి తీర్పును వెల్లడిరచే అవకాశముంది. కానీ ఇది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. దీంతో 17ఏ వర్తింపు కేసులో తీర్పుపై అనిశ్చితి కొనసాగుతోంది.
సవరణ చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం తమపై స్కిల్ డెవ లప్మెంట్ కేసు పెట్టేముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసు కోవా లని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించి నందున స్కిల్ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చంద్రబాబు మొదట రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దానిపై ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘమైన విచారణ చేపట్టింది.
చంద్రబాబు తరుపు వాదనలు
17 ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించ కుండా చట్టంలో నిర్దేశించబడిన విధాన ప్రక్రియను ఉల్లంఘించి నందున స్కిల్ కేసును కొట్టివేయాలని చంద్రబాబు న్యాయవాదు లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా గట్టి వాదనలు వినిపించారు. తమ వాదనకు మద్దతుగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించారు. ముఖ్యంగా ఎంతో ప్రాచూర్యం పొం దిన రఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించిన యశ్వంత్ సిన్హా కేసు, లలిత కుమారి కేసులను ప్రస్తావించారు. ఇది ‘రెజీమ్ రివెంజ్’ ప్రభుత్వ కక్ష సాధింపు కేసు అని పేర్కొం టూ.. చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం పెడుతున్న పలువరుస కేసులను ప్రస్తావించారు. విచారణ సందర్భంగా 17ఏ చంద్రబాబుకు వర్తించేలా కనపడుతుందే అని ఒక న్యాయమూర్తి ప్రస్తావిం చటం గమనార్హం.
సిఐడి తరపు వాదనలు
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ జూలై 2018కి ముందు జరిగిన నేరాలకు వర్తించదని సిఐడి తరఫున ముకుల్ రోహిత్గి వాదించారు. స్కిల్ కేస్ విచారణ ఆరంభ దశలో ఉన్నదని,ఈ సమయంలో కేసును కొట్టివేయడం తగదని ఆయన వాదించారు. విచారణ సందర్భంగా స్కిల్ కేసులో ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు నమోదయిదన్న విషయంపై దృష్టి సారించారు. 2016 లోనే జీఎస్టీ అధికారుల సమాచారం మేరకు విచారణ మొదలైం దని, కనుక 2018లో అమల్లోకి వచ్చిన 17ఏ చంద్రబాబుకు వర్తించదని ముకుల్ రోహిత్గి వివరించారు. అయితే స్కిల్ కేసు లో డిసెంబర్ 2021న నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచా రణ చేపట్టామని సిఐడి తమ రిమాండ్ రిపోర్ట్‌లో స్వయంగా పేర్కొందని, కనుక 17ఏ చంద్రబాబుకు తప్పక వర్తిస్తుందని సాల్వే సిఐడి వాదనలను బలంగా తిప్పుకొట్టారు. ఇరుపక్షాల వాదనలు పలు రోజులపాటు వాడి వేడిగా సాగాయి.
స్కిల్ కేస్ అక్రమాలు
డిసెంబర్ 2021లో ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో అసలు చంద్రబాబు పేరేలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత చంద్రబాబు పేరును చేర్చారు. విచారణకు రావాలని ఆయనకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. రాజకీయ కుట్రతో ఆయనను 37వ నిందితుడిగా చేర్చి హడావిడిగా సెప్టెంబర్ 9వ తేదీన అరెస్టు చేసి తప్పుడు రిమాండ్ రిపోర్టుతో చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపింది అరాచక జగన్ ప్రభుత్వం. ఎటువంటి సాక్ష్యాధారాలు పొందలేకపోయినా చంద్ర బాబును అరెస్ట్‌చేసి, వాటిని తగు సాక్ష్యాలను సాధిస్తామన్న తీరు తో వ్యవహరించింది జగన్ కనుసన్నల్లో నడిచే సిఐడి. వరుస కేసులతో వీలైనంత కాలం చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా నిర్బంధించాలనే కుట్రలో భాగంగానే స్కిల్ కేసుకు మొదటగా తెరతీసింది జగన్ ప్రభుత్వం. 52 రోజులపాటు జైల్లో పలు ఇబ్బందులకు గురైన చంద్రబాబు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో వైద్యసేవల కోసం గతనెల 31న బయటకు వచ్చారు. ఉండవల్లిలోని తన స్వగృహానికి వచ్చే దారి పొడవునా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టడంతో.. 14 గంటల సుదీర్ఘ రోడ్డు ప్రయాణం తర్వాత చంద్రబాబు ఇంటికి చేరగలిగారు.
వ్యవస్థల దుర్వినియోగం
14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును తన అరాచక విధ్వంసక పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తున్నారన్న అక్కసుతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజకీయ కుట్రతో కేసుల పరంపరకు తెరతీశాడు. దీని కోసం పలు వ్యవ స్థల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. నాలుగున్నర ఏళ్ల నిష్క్రియా పర్వం తర్వాత సిఐడిని ఎగదోసి ఎట్టి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఇరికించాడు.ఒక్క కేసుతో చంద్రబాబును ఎక్కువ కాలం నిర్బంధించలేమని ఇప్పటికి ఏడు కేసులు పెట్టించాడు. స్కిల్ కేసులో మిగతా 36మంది ఆరోపితులు బెయిల్‌పై ఉన్నా .. చంద్రబాబు బెయిల్‌ను సిఐడి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
స్కిల్ కేసులో సిఐడి పరస్పర విరుద్ధంగా వాదిస్తోంది. ఆ వాదనల ప్రకారం.. స్క్వాష్ పిటిషన్ కొట్టివేత తీర్పులో ఈ కేసు విచారణ అంతిమ దశలో ఉందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొ నగా.. విచారణ తొలిదశలోనే ఉందని సుప్రీంకోర్టులో సిఐడి న్యాయవాది రోహిత్గి ద్వారా సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిం ది సిఐడి. వాదోపవాదనలను కొనసాగించి తీర్పును ఆలస్యం చేయాలనే దురుద్దేశంతో సుప్రీంకోర్టులో చెప్పిందే చెప్తూ సిఐడి పలు రోజులు కొనసాగించింది.
చంద్రబాబు స్క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రస్తావించిన కొన్ని అంశాలు న్యాయ నిపుణులను ఆశ్చ ర్యానికి గురిచేశాయి. అధికార బాధ్యతల నిర్వహణకు సంబం ధించిన అంశాలకు మాత్రమే 17ఏ వర్తిస్తుందని.. కుట్రపూరితం గా జరిగిన అవినీతితో కూడిన నేరాలకు కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించి చంద్రబాబును ఈ దశలోనే దోషిగా తేల్చడం సబబు కాదని నిపుణుల అభిప్రాయం.
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలమా?
సుప్రీంకోర్టులో చంద్రబాబు స్క్వాష్ పిటిషన్‌పై సాగిన ఇరు పక్షాల వాదనలలోని బలాబలాలు, అవినీతి నిరోధక సవరణ చట్టం 2018ప్రధాన ఉద్దేశం, రాజకీయ ప్రేరిత కేసులను అరి కట్టవలసిన అవసరం, గతంలో యశ్వంత్ సిన్హా మరియు ఇతర కేసుల్లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా చంద్రబాబుకు 17ఏ వర్తింపుపై సానుకూల తీర్పు వస్తుందని న్యాయ కోవిదు లు, టిడిపి నాయకులు, శ్రేణులు, దేశ విదేశాల్లోని చంద్రబాబు అభిమానులు విశ్వాసంతో ఉన్నారు.
తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఆయనపై ఇప్పటి వరకు నమోదైన ఇతర అవినీతి కేసులు వీగిపోతాయని న్యాయ నిపుణుల అభిప్రాయం. 17ఏ విషయంలో సుప్రీం కోర్టు ఇవ్వనున్న తీర్పు చారిత్రాత్మకం అవుతుందని, రాజకీయ కక్ష సాధింపులకు వ్యవస్థలను దుర్వినియోగం చేసే జగన్ మార్కు కుట్రలకు అడ్డుకట్ట వేస్తుందని విశ్వాసంతో పలువురు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో 17ఏ పై రానున్న తీర్పు ఒక కొత్త అధ్యాయానికి తెర తీయనుంది. 17ఏ విషయంలో సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పు న్యాయానికే పరీక్షకానుంది. ఏం జరగనుందో.. తెలుసుకోవడానికి వేచి చూద్దాం!