హైదరాబాద్ : ఎన్టీఆర్ భవన్లో టీడీపీ టీఎస్ ప్రోగ్రామ్ కమిటీ మాజీ కన్వీనర్ జి. బుచ్చిలింగం వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ టీఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిలింగం చిత్రపటానికి పుష్పాలను సమర్పించి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న టీడీపీ టీఎస్ అధ్యకక్షులు బక్కని నర్సింహులు మాట్లాడుతూ…బుచ్చిలింగం తన జీవిత కాలం అంతా తెలుగుదేశం పార్టీలోనే ఉండి పార్టీ కోసం పనిచేశారని అన్నారు. రాజకీయ నాయకులు పార్టీలు మారితే ప్రజలలో అటువంటి నాయకుల పట్ల చులకన భావం ఏర్పడుతోందన్నారు. బుచ్చిలింగం మున్సిపల్ ఛైర్మన్‌గా, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారని అన్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో పాదయాత్ర కూడా చేశారని గుర్తుచేశారు. క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పనిచేసిన బుచ్చిలింగం గారి స్ఫూర్తితో మనమందరం కలిసి పార్టీ కోసం పనిచేద్దామని అన్నారు.
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో బుచ్చిలింగం గారు పనిచేశారని అన్నారు. వారి అంకిత భావాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ అధ్యకక్షులు పైడి గోపాల్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం, ఎస్సీ సెల్ అధ్యకక్షులు పి. అశోక్, ఐటీడీపీ అధ్యకక్షులు హరికృష్ణ, టీఎన్టీయూసీ నాయకులు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.