భీమవరం: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఏ క్షణాన ఎక్కడ దాడిచేస్తాడో తెలియక ఆనాడు బ్రిటిష్ పాలకులు హడలిపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆంగ్లేయులకు కంటిమీద కునుకులేకుండా చేసి వారికి సింహస్వప్నంగా మారారని తెలిపారు. 125వ జయంతి వేడుకల సందర్భంగా భీమవరంలో నూతనంగా ఏర్పాటుచేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తరపున అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులతో కలసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు తదితరులు పాల్గొన్నారు.