- విశాఖ కమిషనర్‌గా సంపత్‌కుమార్
- విజయవాడ కమిషనర్‌గా ధ్యానచంద్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 62 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు, జాయింట్ కలెక్టర్లు, కార్పొరేషన్ కమిషనర్లు బదిలీ అయ్యారు.
కొత్త పోస్టింగ్‌లు:
సీహెచ్ శ్రీదత్: మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ (మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు), ఎం.వి. శేషగిరి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, రేఖారాణి: హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖ కమిషనర్, మల్లికార్జున: బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ (బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్ అదనపు బాధ్యతలు), చేవూరి హరికిరణ్ : ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్, ప్రసన్న వెంకటేశ్: సాంఘిక, సంక్షేమశాఖ కార్యదర్శి, శ్రీకేష్ బాలాజీరావు: భూ సర్వే, సెటిల్మెంట్లు డైరెక్టర్, గిరీశ్ షా: పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ, నారపురెడ్డి మౌర్య: తిరుపతి మున్సిపల్ కమిషనర్, దినేష్ కుమార్: గుంటూరు మున్సిపల్ కమిషనర్, ఎం.వేణుగోపాల్ రెడ్డి: మహిళ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్, నిషాంత్ కుమార్: ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, సూరజ్ ధనుంజయ్: పల్నాడు జేసీ, జి.సి. కిషోర్ కుమార్: క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ మిషన్ ఎండీ, రామసుందర్‌రెడ్డి: ఆర్అండ్ఆర్ కమిషనర్, కీర్తి చేకూరి: ట్రాన్స్ కో జాయింట్ ఎండీ, విజయ సునీత: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, సంపత్ కుమార్: విశాఖ మున్సిపల్ కమిషనర్, ధ్యానచంద్ర: విజయవాడ మున్సిపల్ కమిషనర్, కేతన్ గార్గ్: రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్, అమిలినేని భార్గవతేజ: గుంటూరు జిల్లా జేసీ, హిమాన్షు కోహ్లి: తూర్పుగోదావరి జేసీ, నిశాంతి : కోనసీమ జిల్లా జేసీ, గోవిందరావు : కాకినాడ జిల్లా జేసీ, ఎన్. తేజ్ భరత్ : కడప మున్సిపల్ కమిషనర్, లక్ష్మీశా: మెడికల్ సర్వీసెస్ ఎండీ, వీరపాండ్యన్: సెర్ప్ సీఈవో , మంజీర్ జిలాని: మార్క్‌ఫెడ్ ఎండీ, కృతికా శుక్లా: ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, రవి సుభాష్: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ, రాజాబాబు: గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ, కె శ్రీనివాసులు: హార్టికల్చర్ ఎండీ, లావణ్య వేణి: సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్, అభిషిక్త్ కిషోర్: ఏపీఐఐసీ ఎండీ , ఎ. సిరి: సెకండరీ హెల్త్ డైరెక్టర్, గుమ్మల గణేష్‌కుమార్: స్కిల్ డవలప్మెంట్ ఎండీ.