అమరావతి(చైతన్యరథం): తొలి తెలుగు న్యూస్ రీడర్, యాంకర్, రచయిత శాంతిస్వరూప్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు దూరదర్శన్లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతి స్వరూప్. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్ళం. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కారం పొందేవారు. ఈ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.