పెనుకొండ: వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం అంటే… రైతుల మెడకు ఉరి తాళ్లు బిగించడమే అని సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీకే. పార్థసారథి విమర్శించారు. గోరంట్ల మండలం మార్కెట్ యార్డు వద్ద నడిరోడ్డుపై ధర్నా నిర్వహించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు బీమా ఇవ్వాలన్నారు. రాజన్న రాజ్యమని చెప్పిన జగన్ రెడ్డి రైతుల చెవిలో పువ్వులు పెట్టాడన్నారు. రైతన్న సంక్షేమం కోసం, అన్నదాతలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తెలుగుదేశం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సోమశేఖర్, దేవా నరసింహాప్ప, సర్పంచులు అశ్వర్త రెడ్డి, నరసింహమూర్తి, భాస్కర్ రెడ్డి, నీలకంఠరెడ్డి, సు ధాకర్ రెడ్డి, చంద్ర, వెంకట రంగారెడ్డి, కృష్ణమూర్తి, గిరిధర్ గౌడ్, ఉత్తమ్ రెడ్డి, బాలకృష్ణ, జయచంద్ర, అమ్మిబాయి, కురుమల జయరామ్, వేణు, ఫిరోజ్, రామచంద్ర రెడ్డి, మనోహర్, రెడ్డప్ప, నరేంద్ర, ఉమర్, గంగిరెడ్డి, రవి నాయక్, రాజారెడ్డి, వెంకట్ రెడ్డి, తిరుపాలు, రంగనాయకులు, వెంకటరమణప్ప, నారాయణస్వామి, గంగిరెడ్డి, సుబ్బరాయుడు, బాలాజీ, శేషాద్రి, రామచంద్ర, భాస్కర్ రెడ్డి, ప్రభాకర్, కన్నా రెడ్డి, నరసింహులు, డాక్టర్ గిరి, హరి రెడ్డి, నరేష్, విక్రమ్, భరత్, మూర్తి, కార్తీక్, శ్రీనివాసులు, వెంకటేష్, బాలకృష్ణ, రాఘవేంద్ర, మనిశేఖర్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.