నంద్యాల: అధికార పార్టీ నేతలు తమ స్వార్థం కోసం, రియల్ వ్యాపారం కోసం చాపిరేవుల గ్రామ ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని… దీనిపై న్యాయ పోరాటం చేస్తామని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో 100 కుటుంబాలను ఇబ్బంది పెట్టే నిర్ణయంపై ఆయన గ్రామస్తులతో కలిసి నంద్యాల జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందించారు. బైపాస్ నిర్మాణం వల్ల పలువురికి మేలు జరుగుతుందన్నారు. కేవలం కొందరి స్వార్థం కోసమే గ్రామంలో 60 అడుగుల రోడ్డు వెడల్పుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.