.మీకు ఖాకీ బట్టలు వేసుకునే అర్హత ఉందా?
.అసాంఘిక శక్తుల్లా అర్థరాత్రి గోడలు దూకుతారా?
అమరావతి: సోషల్ మీడియాకు సంబంధించి ఏదైనా కేసు ఉంటే సుప్రీంకోర్టు నిబంధనలు అనుసరించి 41ఎ నోటీసులు ఇవ్వాల్సి ఉండగా అర్థరాత్రి ఇళ్లపైకి అసాంఘిక శక్తులమాదిరి వెళ్లి తలుపులు బద్దలు గొట్టే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టును షేర్ చేస్తే పగలు వెళ్లి నోటీసులు ఇవ్వకూడదా? గోడలు దూకి రౌడీల్లా వెళ్లాల్సిన పనేమిటి? మీకు ఆ అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.
1.పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్‌కు కట్టుబడి పనిచేయాలి. డికె బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసును ఒకసారి చదువుకోవాలి. గోడదూకే అలవాటుతో వెళ్లిన సిఐని నేను అడుగుతున్నా… వెంకటేష్‌ను అరెస్ట్ చేసే సమయంలో నేమ్ ట్యాగ్ పెట్టకున్నావా… ఉంటే రైట్ రాయల్‌గా వెళ్లకుండా దొంగలా గోడలు దూకడమేమిటి?
2.ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న విషయం కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు 8నుంచి 12గంటలలోపు చెప్పాల్సి ఉంది. వెంకటేష్ అరెస్ట్‌లో ఈ నిబంధన పాటించారా? డీజీపీ, సిబిసిఐడి అడిషనల్ డీజీ సమాధానం చెప్పాలి. మా కార్యాలయంలో పనిచేయడం నేరమా… ఇష్టప్రకారం కొడితే భయపడి మా వద్ద ఎవరూ పనిచేయరని అనుకుంటున్నారా? మా ఆఫీసుపై దాడిచేసినపుడే మీరు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో తేటతెల్లమైంది. సిగ్గుతో తలదించుకోవాలి… మీకు కాకి బట్టలు వేసుకోవడానికి అర్హత ఉందా?
3.నిందితుడి అరెస్ట్ చేసినపుడు అతడి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఇన్స్క్షన్ మెమో ఇవ్వాలి. వెంకటేష్ విషయంలో ఆ నిబంధనను ఎందుకు పాటించలేదు?
4.అరెస్ట్ చేశాక ఎక్కడకు తీసుకెళ్తున్నారో, ఎందుకు తీసుకెళ్తున్నారో సంబంధిత వ్యక్తికి చెప్పి మెమో ఇచ్చి అరెస్ట్ చేయాలి. వెంకటేష్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేసి ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదు. 41ఎ నోటీసు ఇస్తే లాయర్‌ను ఎందుకు అనుమతించలేదు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.