అమరావతి:- శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి మండలంలో జరిగిన ప్రమాదంలో 5గురు వ్యవసాయ కూలీలు ప్రాణాలు కోల్పోవడం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆటోలో కూలీ పనులకు వెళుతున్న వారు చిల్లకొండయ్య పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందని చంద్రబాబు అన్నారు. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్ హై టెన్షన్ తీగలు తెగిపడిన ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా….పలువురు గాయపడిన ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంతో ప్రాణాలు పోవడానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని…. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.