- ఉచిత ఇసుక విధానంపై రోత రాతలు
- పెత్తనమంతా పచ్చ నేతలదంటూ ఏడుపు
- అసత్యాలతో విష కథనాల ప్రచారం
- నిల్వ చేసుకున్న ఇసుక పంచేస్తుంటే బాధ
- భారీ ధరలకే అమ్మాలంటూ వక్ర సూచనలు
- మళ్లీ.. మన్నుగొట్టడానికే యత్నం
- కూటమి ప్రతిష్టపై విషంగక్కుతోన్న వైనం
- ప్రజలపై వైకాపాకు ఎందుకింత పగ?
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోన్న కూటమి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతోంది జగన్ విషపుత్రిక సాక్షి. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ పాయింట్లనుంచి ఉచిత ఇసుక తీసుకెళ్లడానికి తిరునాళ్ల మాదిరి ప్రజలు వరుస కడుతుంటే.. ఉచిత ఇసుక మోసపు విధానమంటూ రోత రాతలకు పదును పెట్టింది. గత ప్రభుత్వంలో ప్రజల్ని నానాయాతనలు పెట్టి, 40 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి.. వైకాపా సైకత రాకాసులు కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. దోపిడీయే లక్ష్యంగా గత పాలకులు అమలు చేసిన 2019, 2021 ఇసుక విధానాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టడమే నీలిమీడియా కంటగింపునకు కారణం. వైకాపా సర్కారే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో.. కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి ముందే తవ్వుకుని ఇసుకను దాచుకున్నారు. అలా దాచుకున్న ఇసుక పరిమాణం 48 లక్షల మెట్రిక్ టన్నులని అంచనా. అంటే, వైకాపా దృష్టిలో వేల కోట్ల రూపాయల ఇసుక. ఇప్పుడు దాన్ని ఉచితంగా ప్రజాపరం చేస్తున్న కూటమి విధానాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక, పూడికరూపంలో జలాశయాల్లో ఉన్నది ప్రజలకు సరఫరా చేసేలా కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.
ఖర్చులు పెట్టుకుంటే చాలు..
ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకున్నా.. కేవలం సీనరేజ్ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకొని, ఇసుక అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాను అధికారంలోకి వస్తే తిరిగి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తానని మాటిచ్చిన చంద్రబాబు.. అన్న మాట ప్రకారం ఇసుకను ప్రజాపరం చేశారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పిస్తూ.. పారదర్శకంగా డిజిటల్ చెల్లింపులనే అంగీకరిస్తూ.. ఏ రోజుకు ఆరోజు ఇసుక నిల్వల వివరాలు ప్రకటిస్తూ.. పారదర్శక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీన్నే వైకాపా విషపుత్రిక జీర్ణించుకోలేకపోతోంది. ఉచితంగా ఇసుక ఇస్తున్నామంటూనే.. స్టాక్‌యార్డుల వద్ద ధరల పట్టికలు పెట్టారంటూ పైత్యపు రాతలకు తెగబడుతోంది. వైకాపా మూకలే ఇసుక ధరలతో ఫ్లెక్సీలు వేసి.. వాటి ఫోటోలను ప్రచారంలోకి తెచ్చి.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, వైకాపా దిగజారుడు తనానికి పరాకాష్ట. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామన్న ప్రభుత్వం మాటలు మాయ నాటకాలుగా తేలిపోయిందంటూ అసత్యాల ప్రచారానికి తెగబడటం సిగ్గుచేటు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చి ఒక్కరోజు కూడా పూర్తికాకమునుపే.. కోట్ల రూపాయల ఇసుకను తినేస్తున్నారంటూ అభూత కల్పనలు ప్రచారం చేయడం.. పేదల నోట మన్నుగొట్టడానికే.
ఫ్లెక్సీలు వాళ్లవే.. ప్రచారమూ వాళ్లదే
వైకాపా మూకలే ఫ్లెక్సీలు వేసి.. ప్రదర్శనకు పెట్టి.. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారంటూ కథనాలు రాయడం సాక్షికే చెల్లింది. మళ్లీ వైసీపీ గద్దెనెక్కితే.. వర్షాకాలంలో ఇసుక వ్యాపారానికి అడ్డులేకుండా గుత్తేదారులు ముందే ఇసుక మేటలు నిల్వచేశారు. వైకాపాకు ప్రజలు జెల్లకొట్టడంతో.. ఆ ఇసుక నిల్వలు ప్రజలకోసమే సిద్ధం చేసినట్టు నమ్మబలుకుతోంది విషపత్రిక. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో పెద్దఎత్తున పెట్టిన ఇసుక నిల్వలను కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేస్తుండటంతో.. వైకాపా సైకత రాక్షసులు జీర్ణించుకోలేకపోతున్నారు. 21 జిల్లాల్లోని 88 నిల్వ కేంద్రాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రజల పరమైపోతుందన్న బాధతో ప్రభుత్వంపై విషం జిమ్ముతోంది. ‘ఉచితం’ అంటే ప్రభుత్వానికి రాబడి ఆశించకుండా అని అర్థం. అలాంటిది ఉచితం అన్న పదానికి వక్రభాష్యం చెబుతూ.. ఉచితంగా ఇస్తానన్న ఇసుకకు ధర నిర్ణయించారంటూ గగ్గోలు పెట్టడం మడత కథనాలు అల్లే నీలిపత్రికకే చెల్లు.
భారీ ధరలకే అమ్మాలంటూ వక్ర సూచనలు
ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం `నీలిపత్రిక దృష్టిలో ఏమాత్రం మేలు కాదు. అందుకే ప్రజలకు ఎలాంటి మేలు చేయని పథకంగా ఇసుక విధానాన్ని అభివర్ణించడం సాక్షికే చెల్లింది. అలాగే.. ఖజానాకు ఆదాయం సమకూరని తాత్కాలిక కొత్త విధానాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చిందంటూ విష ప్రచారానికి దిగింది. అంటే, సాక్షి ఉద్దేశం ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వకూడదు. వైకాపా సర్కారీ విధానంలోనే ప్రజలకు ఇసుక అందకుండా చేసి.. భారీ ధరలకు అమ్ముకోవాలన్న వక్ర సూచనలు చేయడం నిస్సిగ్గుతనం. వైకాపా ఏలుబడిలో ఒక్క ఇసుకమీదే ఏటా రూ.750 కోట్ల ఆదాయం సమకూర్చినట్టు చెప్పుకోవడం అబద్ధాల సమర్థింపే. సామాన్యుడికి ఇసుక అందకుండాచేసి ఏటా వేల కోట్ల రూపాయల దోపిడీ సాగించిన వైకాపా సర్కారు.. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చామని చెప్పుకోవడం దారుణం. పైగా వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా ఇసుక విక్రయాలు చేపట్టామని, ప్రజలకు సులభంగా, అందుబాటు ధరలో అందించామని అసత్యాలు వల్లెవేయడం ఆత్మవంచన!
నిల్వ చేసుకున్న ఇసుక పంచేస్తుంటే బాధ
అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లపై కూటమి సర్కారు దృష్టి పెట్టడం.. వైకాపా గుత్తేదారులకు ఇసుకను తరలించుకుపోయే అవకాశం లేకుండా పోయింది. వర్షాకాలంలోనూ వ్యాపారం యథేచ్ఛగా సాగించేందుకు స్టాకు చేసి పెట్టుకున్న 40 లక్షల టన్నుల ఇసుకను వైఎస్సార్సీపీ గుత్తేదారులు వదిలేయాల్సి వచ్చింది. నదీగర్భాలను చీల్చి తీసిన ఇసుకంతా అక్రమ తవ్వకాలే. భారీ మెజారిటీతో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో `దొరికిపోతామన్న భయంతో ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసి, ప్రతిమ ఇన్ఫ్రా ప్రతినిధులు సైలెంట్‌గా పక్కకు తప్పుకున్నారు.
మళ్లీ.. మన్నుగొట్టడానికే యత్నం..
నిర్మాణ రంగానికి ఇసుకే ప్రధానం. లక్షలమందికి నిర్మాణ రంగమే జీవనాధారం. ఇసుక ధరలను నియంత్రణలో ఉంచకపోతే సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్రప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. దీనివల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. పారిశ్రామికీకరణకు విఘాతం కలుగుతుంది. అందుకే `నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుకను ప్రజాప్రయోజనాల దృష్ట్యా వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటివల్ల రాష్ట్రమంతటా భవన నిర్మాణాలు, నీటిపారుదల పనులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాజధాని భవనాలు తదితరాల నిర్మాణాలకు సరసమైన ధరల్లో ఇసుక అందుబాటులోకి వస్తుంది. విధ్వంసాన్ని కోరుకునే వాళ్లకు ఇలాంటి ప్రగతి నచ్చదు. అందుకే `ప్రభుత్వ సదుద్దేశానికి తూట్లు పొడిచే కథనాలను రాస్తోంది నీలిమీడియా. ప్రజల్లో గందరగోళం సృష్టించి ఉచిత ఇసుక విధానాన్ని దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. పైగా ఉచిత ఇసుక విధానంతో ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగడాన్ని సైతం జీర్ణించుకోలేకపోతోంది.
జిల్లా ఇసుక కమిటీలే కీలకం
ఇసుక లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా పారదర్శక, కఠినమైన నియమ నిబంధనలు విధించినా.. స్టాకులో సగం ఇసుకను తినేశారంటూ తొలిరోజే కథనాలు అల్లడం ‘విషపుత్రిక‘కే చెల్లింది. వాస్తవానికి `ఇసుక లావాదేవీల్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కలెక్టర్ చైర్మన్, ఎస్పీ, జేసీ, సబ్ లెక్టర్/ ఆర్జీవో, ఎస్‌ఈబీ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్టీవో, భూగర్భజలశాఖ డీడీ, జలవనరులశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, కాలుష్యనియంత్రణ మండలి ఈఈలు సభ్యులుగా, జిల్లా గనులశాఖ అధికారి కన్వీనర్‌గా సెటప్ పెట్టింది. నిల్వ కేంద్రాలకు ఇన్‌చార్జిలుగా వీఆర్వో, వీఏవో, గ్రామ, వార్డు సచివాలయ అధికారుల్లో ఒకరిని కలెక్టర్ నియమిస్తారు. ఇసుక తవ్వి, రీచ్‌నుంచి నిల్వ కేంద్రానికి రవాణా చేసినందుకు అయిన నిర్వహణ ఖర్చు, స్టేషనరీ వ్యయం, సీనరేజ్ ఫీజు, జీఎస్టీ మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుంటారు. ఈ ఖర్చులు టన్నుకు ఎంత పడుతుందనేది జిల్లాస్థాయి కమిటీ ఖరారు చేస్తుంది. అలాగే స్టాకు ఎంతవుంది? ఎప్పటినుంచి ఎప్పటి వరకూ విక్రయాలు, ఒకరికి రోజులు ఎన్ని టన్నుల ఇసుక ఇస్తారు, ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్ రూపంలో చెల్లింపు, ముందు వచ్చినవారికే ముందు లోడు. నిర్మాణ అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసినా, తిరిగి అమ్మినా, ఇతర అవసరాలకు వినియోగించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా క్రిమినల్ కేసులు పెడతారు. జరిమానాలు విధిస్తారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే రూ.2 వేలనుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఇన్ని నిబంధనలు పెట్టినా.. అక్రమాలు జరుగుతున్నాయంటూ గగ్గోలు పెట్టడం.. నీతిమాలిన నీలిపత్రికకే చెల్లు.
ఇది కదా నిజం!
నాడు జగన్‌రెడ్డి ఇసుక రేట్లు ప్రకటిస్తూ ప్రముఖ పత్రికలో ఇచ్చిన ప్రకటనలు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక విధానంలో కేవలం లోడిరగ్, రవాణా చార్జీలు తీసుకుంటూ టన్ను ఇసుకకు పెట్టిన ధర. పోల్చిచూస్తే.. జగన్ సర్కారు మూడు రెట్లు ఎక్కువ ప్రజల దగ్గర పీక్కుతిని తాడేపల్లి ప్యాలెస్‌లో మూటలు దాచుకున్న విషయం అర్థమవుతుంది. 40 లక్షలమంది బడుగులైన భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేసిన పాపమూ అవగతమవుతుంది.