కర్నూలు: పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి ఆకేపోగు ప్రభాకర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు వై.నాగేశ్వరరావుయాదవ్, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవి కుమార్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్ కుమార్, రాష్ట్ర పార్టీ అభుబంధ కమిటీ సభ్యులు జె.తిరుపాల్ బాబు, మహేష్ గౌడ్, మధుసుధన్ నాయుడు, బోయ సంజీవ లక్ష్మి, బజారన్న నగర పార్టీ అధ్యక్షులు గున్నా మార్క్, కార్పోరేటర్ పరమేష్, పార్లమెంట్ పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులు అబ్బాస్, హనుమంతరావు చౌదరి, సత్రం రామక్రిష్ణుడు, బాబురావు, గట్టు తిలక్, చంద్రకాంత్, సనా నరసింహులు మొదలగు వారితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.