రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? ఇదేమి చట్టం? ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో బాధించింది. వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను భువనేశ్వరి కోరారు. ఈ మేరకు రవీంద్రపై రెండో రోజూ జులుం అంటూ పత్రికల్లో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.