నవశకం సభలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మట్లాడుతూ లక్షలాది మంది ప్రజలు హాజరైన ఈ సభ రాబోయే విజయానికి నాంది అన్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలందరూ హింస, అణచివేతలకు గురయ్యారన్నారు. అన్ని వర్గాల ప్రజల గొంతుకగా యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. లైసెన్సెడ్ గూండాల్లా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు.. ప్రభుత్వ అడ్డంకుల్ని అధిగమిస్తూ యువగళం పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర చేస్తున్నాడన్న అక్కసుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేశ్ పై 25 కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి నేత వరకు.. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ వేధింపులు.. తప్పుడు కేసులు ఎదుర్కొన్నవారే. యువగళం ప్రారంభం కాక ముందు హేళన చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు తమ గురించి మాట్లాడితే ఊరుకోబోమని లోకేష్‌ను హెచ్చరించే స్థాయికి వచ్చారు. లోకేష్‌ను అపహాస్యం చేసిన వారే ఆయన వాగ్ధాటికి భయపడేస్థితికి వచ్చారు. ఉప్పెనలాంటి చంద్రబాబు నాయుడికి గర్జన లాంటి పవన్ కల్యాణ్ తోడైన వేళ.. ఉద్యమం లాంటి లోకేష్ కలవడంతో ఫ్యాక్షనిస్ట్ సైకో పాలనను బొందపెట్టడానికి సర్వం సిద్ధమైంది. టీడీపీ-జనసేన ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే ప్రభుత్వం. వైసీపీప్రభుత్వంలో మొదటి బాధితులైన మనం .. టీడీపీ-జనసేన జెండాలు చేతపట్టి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేంతవరకు అలుపు లేకుండా పోరాడాలి. దళితులపై ఊచకోతలు.. బీసీల దహనాలు.. మైనారిటీల ఆత్మహత్య లపై స్పందించలేని వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రులు సిగ్గులేకుండా సామాజిక సాధికార బస్సుయాత్రలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని… జగన్ రెడ్డిని ప్రజలంతా మూకుమ్మడిగా తిరస్కరించాల్సిన సమయం వచ్చింది. తన పార్టీ ఎమ్మెల్యేలు.. మంత్రుల్ని స్థానచనలనం చేస్తున్నా డంటే.. ముఖ్యమంత్రిలో భయం మొదలైందనే అర్థం. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభకాదు… రాబోయే విజయానికి పునాది అని ఎం.ఎస్.రాజు స్పష్టం చేశారు.