మిచౌంగ్ తుఫాన్ కలిగించిన నష్టం ఆవేదన కలిగిస్తోందని నారా భువనేశ్వరి అన్నారు. పెద్ద ఎత్తున ప్రజల ఆస్తి, పంట నష్టం బాధ కలిగిస్తోంది. చేతికొచ్చిన పంట నీటి పాలైన రైతన్నల బాధ వర్ణనాతీతం. తీవ్ర తుఫాన్ తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ సారి కూడా తన వంతు సాయానికి సిద్ధమైంది. సాధ్యమైనంత త్వరగా ఆపన్నులకు ట్రస్ట్ ద్వారా సాయం చేస్తాం. చేతనైన సాయంతో ఊరట కల్పిస్తాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని భువనేశ్వరి పిలుపు ఇచ్చారు.