టిడిపి అధికారంలోకి రానే వీరశైవులను ఓబిసి జాబితాలో చేర్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం కర్నూలు వీరశైవ ఐక్యవేదిక ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీరశైవులకు అర్చకత్వం, పాలకమండళ్లలో సముచిత స్థానం కల్పించాలి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మా సామాజికవర్గీయులు అత్యధికంగా ఉన్నందున చట్టసభల్లో అవకాశం కల్పించాలి.
వీరశైవ లింగాయత్ ల ఓబిసిల్లో చేర్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలి. ప్రస్తుత ప్రభుత్వం వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుచేసినా ఎటువంటి నిధులు కేటాయించలేదు. మా కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో కనీసం కుర్చీలు కూడా లేకుండా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వివిధ సామాజికవర్గాలను దారుణంగా మోసగించింది. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ కు దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తాం. శివాలయాల్లో వీరశైవ అర్చకులకు అవకాశాం కల్పిస్తామని వారికి లోకేష్ హామీ ఇచ్చారు.