- ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడు కేసులు
- టీడీపీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా 60వేలకు పైగా కేసులు
- జగన్ సర్కారు తప్పుడు కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తాం
- గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడతారని నమ్ముతున్నాం
- భయం మా బయోడేటాలో లేదు.. అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం
- ఓటరు జాబితా అవకతవకలపై నేడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
- లోకేష్ నేతృత్వంలో గవర్నర్‌ను కలిసి జగన్ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు, కక్ష సాధింపు చర్యలపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తరపున పోరాడుతున్న, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్న తీరును గవర్నర్‌కు తెలియజేశామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొ న్నారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం, కక్షసాధింపు చర్యలపై మంగళవారం లోకేష్ నేతృత్వంలో టీడీపీ ప్రతినిధి బృందం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ మరో బీహార్ లా మారబోతోందని గవర్నర్‌కు దృష్టికి తీసుకెళ్లామన్నారు. జగన్ కు నరనరాన కక్షసాధింపు తప్ప ఏమీ లేదని ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించాం, ప్రతిపక్షంపై ఎలా కక్ష సాధింపునకు పాల్పడుతున్నారో చెప్పాం, సీనియర్ నాయకులు అచ్చెన్నాయడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్రను నెలల తరబడి ఎలా జైలుకు పం పించారో వివరించాం, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై వంద కేసులు పెట్టి ఎలా వేధిస్తున్నారో తెలియజేశాం.
టీడీపీ కేడర్ పై 60వేల తప్పుడు కేసులు!
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సీనియర్ నేతలపై 260 తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని వివరాలతో సహా గవర్నర్‌కు తెలియ జేశాం. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై 60వేల కేసులు పెట్టిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. నేను యువగళం పాదయాత్ర చేసి నపుడు నాపైన, నాయకులపైన, యువగళం వాలంటీర్లు, కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని సవివరంగా తెలియజేశాం. పవన్ కళ్యాణ్ ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నపుడు ఎలా అడ్డుపడ్డారో తెలియజేశాం. రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై కూడా ముఖ్యమంత్రి ఎలా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారో చెప్పాం. బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను ఎలా చంపారో, దళిత యువకుడు శ్యామ్ కుమార్‌ను ఎలా అవమానించారో చెప్పాం, పలమనేరులో పదోతరగతి విద్యార్థిని మిస్బాను వైసీపీ నేత వేధించి ఎలా ఆత్మ హత్య చేసుకునేలా చేశారు, ఇంకోవైపు న్యాయవ్యవస్థపై కూడా ఎలా దాడులు చేస్తున్నారో గవర్నర్ దృష్టికి తీసు కెళ్లాం. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది, కాపాడతారని ఆశిస్తున్నామని లోకేష్ అన్నారు.
పార్టీకి వచ్చిన విరాళాలు కూడా అవినీతేనా?
మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఆధారాల్లేక పోయినా, సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకపోయినా దొంగ కేసులు పెట్టి ఎలా సతా యించారో, జ్యుడీషియల్ రిమాండ్‌కు ఎలా పంపారో వివరించాం. స్కిల్ కేసులో తొలుత రూ.3వేల కోట్లు అవినీతి అన్నారు, తర్వాత రూ.370 కోట్లు అన్నారు, ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ ఖాతాలో పడ్డాయని చెప్పి ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి సైకో అని అర్థమైంది, ఏ తప్పు చేయని చంద్రబాబుపై చివరకు 27కోట్లు పార్టీ అకౌంట్‌కు వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పై 27 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తారు, అది కూడా పార్టీకి వచ్చిన విరాళాల గురించి. ఎవరైనా వింటే నవ్విపోరా? 2014నుంచి వైసీపీ ఎకౌంట్ లోకి 150కోట్లు ఎలా వచ్చాయి.. మరి దీనికైనా సమాధానం చెబుతారా అని లోకేష్ ప్రశ్నించారు.
తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం!
అవినీతి నిరోధక చట్టం 17ఏ కి 2018లో సవరణ వచ్చింది, చంద్రబాబుపై కేసు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని చెప్పాం. వివరాలన్నీ తెప్పించుకుంటామని గవర్నర్ చెప్పారు. భయం మా బయోడేటాలో లేదు… పోరాటమే, అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు, 10వ తేదీ నుంచి రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది. వచ్చే తీర్పులను బట్టి భవిష్యత్ కార్యా చరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం అనివార్యం, రాష్టస్థాయి నుంచి గ్రామ కార్య కర్త వరకు కేసులు పెడుతున్నారు. న్యాయ పోరాటం చేస్తాం.టీడీపీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందిస్తు న్నాం,కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, కాపాడుకుంటాం. నేను, అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా చూస్తున్నామని లోకేష్ తెలిపారు.
నేడు ఎన్నికల కమిషన్‌ను కలుస్తాం!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై బుధ వారం టీడీపీ బృందం ఎన్నికల కమిషన్‌ను కలుస్తుంది, ఓటర్ల జాబితాలో అధికార వైసీపీ పాల్పడుతున్న అక్ర మాలపై లేఖలు ఇస్తాం, తప్పుల తడక ఓటరు జాబితా లపై ఫిర్యాదు చేస్తాం. దొంగఓట్లపై మేం పోరాడతాం. ఢిల్లి కి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో కూడా దొంగ ఓటు ఉంది, సీిఎం 38 కేసుల్లో దొంగ, 10 సంవత్సరాలుగా బెయిల్‌పై తిరుగు తున్న దొంగ. సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్. అవినాష్‌రెడ్డిని కాపాడటానికి సీబీఐని ఏపీకి రానీయ కుండా చేశారు. ఒక దొంగ నుంచి మంచి పరిపాలన ఎలా ఆశిస్తాం? జగన్‌పై 38 కేసులు ఉన్నాయి, 11 సీబీఐ, 7 ఈడీ కేసులు ఉన్నాయి. పదేళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్నాడు, ఏ తప్పు చేయని చంద్రబాబును 38 కేసులున్న వ్యక్తి 53రోజులు జైలులో ఉంచాడు, అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అంటున్నాం. 2019నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం అమలవుతోందని లోకేష్ విమర్శించారు.
నాయకులంతా ప్రజల్లోనే ఉన్నాం!
ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ నాయకులం దరం ప్రజల్లోనే ఉన్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం, ప్రతిపక్షనేతల పై జరుగుతున్న దాడులను కూడా ప్రజలకు తెలియ జేస్తున్నాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జేఏసీ మీటింగ్‌లో కూడా టీడీపీ సూపర్‌సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం. చాలా బాగుతున్నాయని అన్నారు, పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జేఏసీ మీటింగ్‌లో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది, పశ్చిమ ప్రాంతంలో తాగునీటికి కటకట లాడుతున్నారు, దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయిం చుకున్నామని లోకేష్ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఉన్నారు.