- కామాంధులుగా మారిన భర్త, ఇద్దరు మరుదులు
- నిలదీస్తే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తామని బెదిరిస్తున్నారు
- దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
- ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో బాధితురాలి ఫిర్యాదు
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన నేతలు
మంగళగిరి(చైతన్యరథం): తనను కూలి పనికి పంపించి ఇంట్లో ఉన్న కూతురికి మత్తు బిల్లలు ఇచ్చి తన భర్త, అతని అన్న, తమ్ముడు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. నిలదీస్తే తనను పిచ్చి దానిని అని నెపం వేసి పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తామని బెదిరిస్తున్నారు. ఈ దారుణంపై దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వారి నుంచి తన బిడ్డను రక్షించాలని గుంటూరు పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధికి చెందిన బాధితురాలు వేడుకుంది. న్యాయం చేయాలని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా వినతుల కార్యక్రమంలో నేతలకు వినతిపత్రం అందజేసింది. స్పందించిన మాజీ ఎమ్మెల్యే, ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, జంగా కృష్ణమూర్తి అర్జీని స్వీకరించి పోలీసు అధికా రులతో మాట్లాడి విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పుట్టుకతోనే అంధత్వం..పింఛన్ ఇప్పించండి
ఆరేళ్ల వయసున్న తన కుమారుడు పుట్టుకతోనే అంధుడని..పింఛన్ మంజూరు చేయాలని గత ప్రభుత్వంలో అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం గంగవరం గ్రామానికి చెందిన కేశనపల్లి చిన్న పోలయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ సానుభూతిపరులమని పింఛన్‌కు అర్హత ఉన్నా ఇవ్వలేదని తెలిపారు. వెంటనే స్పందించిన నేతలు ఆ మండల ఎంపీడీవోతో ఫోన్‌లో మాట్లాడి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.
`సత్యసాయి జిల్లా రోళ్ల మండలం మజరా అలుపనపల్లికి చెందిన రత్నమ్మ సమస్యను వివరిస్తూ తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిని పాండురంగారెడ్డి ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేసింది. ఆ భూమిని ఆయన పేరుపై ఎక్కించుకునేం దుకు యత్నిస్తున్నాడని.. అతనిపై చర్యలు తీసుకుని భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని వేడుకున్నారు.
వరద సాయం అందలేదు…ఆదుకోండి
విజయవాడ 140 సచివాలయం పరిధికి చెందిన వరద బాధితులు తమకు వరద పరిహారం అందలేదని తెలిపారు. వరదలో పూర్తిగా నష్టపోయామని పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు. మరో మహిళ తాము గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నారని తప్పుగా నమోదు చేశారని పూర్తి పరిహారం ఇప్పించాలని వేడుకుంది.
`తమ భూమి కొనుగోలు కోసం రూ.1.40 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించు కుని మిగిలిన డబ్బులు రూ.38 లక్షలు ఇవ్వకుండా తమను మోసం చేశారని గుంటూరు కొరిటెపాడుకు చెందిన మాదాల రంగారావు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వడం లేదని మాదాల శ్రీనివాసరావు, అతని బావమరిది ఆలూరి వెంకటేశ్వరరావులపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు.
చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయించండి
రాజాం నగర పంచాయతీలో 2018-2019 కాలంలో ఎస్‌డీపీ, ఎస్‌డీఎస్ గ్రాంట్ల కింద సిమెంటు రోడ్లు, కాలువలు పనులు చేశా. వాటికి సంబంధించిన బిల్లులు నేటికీ మంజూరు కాలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బిల్లులు ఇప్పించాలని విజయనగ రం జిల్లా రాజాం నగర పంచాయతీ సారథిó గ్రామానికి చెందిన టంకాల దిలీప్‌కుమార్ వినతిపత్రం ఇచ్చారు.
` వీలైనంత త్వరగా రాజాం, సారథి, కొండంపేట, కొత్తవలస, పొనుగుటివలస పంచాయ తీలను నగర పంచాయతీగా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సారథిó గ్రామ మాజీ సర్పంచ్ టంకాల వెంకటేశం విజ్ఞప్తి చేశారు. రాజాం నగర పంచాయతీగా ఏర్పడి 18 సం వత్సరాలు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించక ప్రజా ప్రతినిధులు లేక అభివృద్ధి కుంటు పడిరదని వివరించారు.
కుమార్తె కనిపించడం లేదు
దైవ దర్శనం కోసమని కుమార్తెను తీసుకుని మాలకొండకు వెళ్లానని, కుమార్తె గుడి బయ ట కూర్చోగా తాను లోనికి వెళ్లి వచ్చేసరికి కనిపించలేదని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం కట్టావారిపాలెం గ్రామానికి చెందిన పావులూరి శ్యాం ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడ వెతికి నా జాడ దొరకలేదని తెలిపాడు. కట్టా బన్ని అనే వ్యక్తిపై అనుమానం ఉందని, తన కుమార్తె ఆచూకీ కనుగొని అప్పగించేలా చూడాలని కోరారు.
` వ్యాపారం నిమిత్తం షాపు కొనడానికి అర్జా రూప్‌కుమార్ అనే వ్యక్తికి రూ.12,53,000 డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామని.. షాపు రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా ఇబ్బంది పెడుతు న్నాడని..డబ్బులు ఇప్పించాలని విజయవాడకు చెందిన బోర సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.
తన భూమిని వేరొకరి పేరుతో ఆన్‌లైన్ చేశారు
తన తండ్రి నుంచి వచ్చిన భూమిని ఇతరులు అని ఆన్‌లైన్‌లో నమోదైందని దాన్ని సరిచే యాలని అధికారులకు అర్జీ పెట్టుకున్నా పట్టించుకోకుండా మంగాపురం గ్రామానికి చెందిన అన్నెం బ్రహ్మారెడ్డి పేరుతో అక్రమంగా ఆన్‌లైన్ చేశారని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండ లం మంగాపురం గ్రామానికి చెందిన బండి రాజశేఖర్‌రెడ్డి, బండి చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ అక్రమానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
` బతుకుతెరువు కోసం సీఎస్‌పురం నుంచి గుంటూరుకు వస్తే తమ భూములను కబ్జా చేశారని గుంటూరుకు చెందిన ఎన్.లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఐదేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని వివరించింది. తమ భూమి తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరింది.