- మైక్రో ఫైనాన్స్ సంస్థలకు నాడు వైఎస్ తోడ్పాటు
- రుణ యాప్‌లకు నేడు జగన్ చేయూత
- రాష్ట్రంలో లోన్ యాప్ మరణాల పాపం జగన్‌రెడ్డిదే
- టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
అమరావతి: రాష్ట్రంలో జగన్‌రెడ్డి అండ చూసుకుని వైసీపీ కాలకేయులు (మహాదుర్మార్గులు) పేట్రేగిపోతున్నారని టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాడు మైక్రో ఫైనాన్స్ సంస్థలను వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సహించి గ్రామీణ ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పారు. నేడు జగన్‌రెడ్డి లోన్ యాప్ సంస్థలపై చర్యలు తీసుకోకుండా అమాయక ప్రజల బలవన్మరణాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లోన్ యాప్ మరణాల పాపం జగన్‌రెడ్డిదేనన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని రాష్ట్ర ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారని చెప్పారు. ఎవరిని అత్యాచారం చేసి చంపేస్తారో, ఎవరిపై అక్రమ కేసులు బనాయిస్తారో, అర్థరాత్రి తలుపు తట్టి దాడులు చేసి అరెస్ట్ లు చేస్తారో అనే భయానక పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నా రు. మహిళా పక్షపాతినని చెప్పుకొనే జగన్ రెడ్డి ప్రభు త్వం ఆచరణలో ఘోరంగా వైఫల్యం చెందుతోంద న్నారు.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకో లేక రాజమండ్రిలో దుర్గారావు దంపతులు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన హృదయ విదారకమైనదని ఆవేద న వ్యక్తం చేశారు. అనాథలయిన ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మనసు కలిచివేస్తోందన్నారు. తల్లిదండ్రు లను పోగొట్టుకున్న చిన్నారులకు ఆర్థిక సాయం ప్రక టించి చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వరుస బలవన్మరణాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోన్‌యాప్ సంస్థల నిర్వాహ కులపై ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవ సరాలను ఆసరాగా చేసుకుని లోన్ యాప్ సంస్థ లు దాష్టీకాలకు పాల్పడుతున్నాయన్నారు. ఒక్క క్లిక్ చాలు నిముషాల్లో డబ్బులు అంటూ ఆశచూపి అప్పుల ప్రజల్ని ఊబిలోకి నెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా రుణం ఇచ్చాక వసూలు చేసే క్రమంలో పైశాచికంగా మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. బాధితుల ఫోన్ నెంబర్లకు నగ్న వీడియోలు పంపడం, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి వారిని మానసికంగా వేధిస్తున్నట్లు తెలిపారు. పరువు పోయిందనే బాధతో బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.