అమరావతి,చైతన్యరథం: అనకొండ జగన్‌రెడ్డి అవినీతి బాగోతం బహిర్గతమౌతోందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఈమేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ‘‘తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు వెనకేసుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరో రూ.2 లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు. తన అనుచరులు, తన సహ నిందితులకు లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్ము దోచిపెడుతున్న విషయం ఒక్కొక్కటీ బట్టబయలవుతున్నాయి. కలుగులోంచి ఎలుకలు బయటకొచ్చినట్లు.. జగన్ రెడ్డి అవినీతి కార్యక్రమాలు ఒక్కొక్కటీ నేడు కోర్టు ఆదేశాలతో బయటకొస్తోంది. మైకు దొరికితే చాలు నీతులు వల్లించే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాసుదేవ రెడ్డి సహా 41 మందికి కోర్టు నోటీసులివ్వడంపై ఏం సమాధానం చెబుతారు? ప్రభుత్వ ప్రకటనలన్నీ ఏకపక్షంగా జగన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌కు కట్టబెట్టారు. ప్రభుత్వ పనుల కోసం సిమెంటు సరఫరా కాంట్రాక్టుల్ని భారతి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్‌కు ఇచ్చారు. 104, 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలు, రామాయపట్నం, కాకినాడ పోర్టుల్ని తన అవినీతి కేసుల్లోని అరబిందోకిచ్చారు. ఇలా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. తీసుకున్న నిర్ణయాలన్నీ క్విడ్ ప్రోకో-2లో భాగమేనని హైకోర్టు నోటీసులతో బహిర్గతమైంది. శుభం పలికే బల్లి కుడితో పడి చచ్చినట్లు.. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు వల్లించే జగన్ రెడ్డి ముఠా నేడు కోర్టు ఆదేశాలతో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. తన బినామీలకు, తన అవినీతి సహ నిందితులకు ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. జగన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి. త్వరలోనే మిగిలిన నిజాలన్నీ బయటకొచ్చి అటు నుంచి తీహార్ జైలుకు పోవడం తధ్యం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
కుడితిలో పడ్డ ఎలుకలా జగన్‌రెడ్డి : ఎంఎ షరీఫ్
జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైందని… ఒక వైపు ప్రజల ఛీత్కారాలు…మరోవైపు వెంటాడుతున్న తన అవినీతి కేసులతో ముఖ్యమంత్రి స్థానంలో ఉండీ, భయభయంగా నిద్రలేని రాత్రుళ్లతో నరకయాత న అనుభవిస్తున్నాడని.. ఆ కేసులకు సంబంధించి తాజాగా వచ్చిన కోర్టు నోటీసులతో జగన్ రెడ్డి అండ్ కో బెంబేలెత్తుతు న్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మ న్ మొహమ్మద్ షరీఫ్ ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన, మాజీమంత్రి పరసారత్నంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో తండ్రి అధికారంతో లక్షకోట్ల ప్రజలసొమ్ము కొల్లగొట్టిన జగన్ రెడ్డి, సీబీఐ..ఈడీ విభాగాల దర్యాప్తులో దోషిగా నిరూపించబడి, 16నెలులు జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు వచ్చాడు. తన తప్పుల్ని.. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తగుదనమ్మా అంటూ ప్రజల్లోకి వచ్చి, ఒక్క ఛాన్స్ అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. నాలుగున్నరేళ్ల పాలనలో తన సహచరులు.. గతంలో తనదోపిడీకి సహకరించినవారితో కలిసి దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ప్రజలసొమ్ము కొల్లగొట్టాడు. వైసీపీ నేతలు మద్యం అమ్మకాలతో రూ.26 వేలకోట్లు గడిరచారని స్వయంగా కేంద్రంలో ఉన్న బీజేపీయే చెబుతోంది. ఈ విధంగా తాను… తన ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాగించిన దోపిడీపై జగన్ రెడ్డి నోరువిప్పకుండా ప్రజల్ని మోసపు మాటలతో నమ్మించి మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు వాస్త వాలు గ్రహించి.. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి.. అతని పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పా లి.’’ అని షరీఫ్ స్పష్టంచేశారు.
కోర్టు నోటీసులపై జగన్‌రెడ్డి, అతని సహచరులు స్పందించాలి: పర్సా రత్నం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పర్సా రత్నం మాట్లాడుతూ ‘‘జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం.. వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షాల పై నిందలేయడానికి వేటకుక్కల్లా వెంపర్లాడుతున్నారు. తమ నాయకుడి అవినీతిపై మాత్రం తేలుకుట్టిన దొంగల్లా కామ్ గా ఉంటున్నారు. జగన్ రెడ్డి అధికారం చేతిలో పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, తనపై ఉన్న అవినీతి కేసుల విచారణకు హాజరుకాకుండా కుంటిసాకులు చెబుతూ న్యాయస్థానాల్ని మోసగిస్తున్నాడు. వైసీపీ ఎంపీ రఘురామరాజు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం తో మరోసారి జగన్ అవినీతికేసుల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రఘురామ పిటిషన్ పై స్పందించి హైకోర్టు తనకు పంపిన నోటీసుల పై జగన్ రెడ్డి..విజయసాయిరెడ్డి తదితరులు ఎందుకు నోరువిప్పడం లేదు? కోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే జగన్ రెడ్డి అతని అవినీతి సహచరు లు కచ్చితంగా న్యాయస్థానం ఆగ్రహం చవిచూడక తప్పదు’’ అని హెచ్చరించారు.