- ఇసుక, మద్యంపై తప్పుడు ఎఫ్‌ఐఆర్ లు సృష్టించడమంటే జగన్ రెడ్డి తన ఇంటికి తానే నిప్పంటించుకున్నట్లే
- అవినీతి తిమింగలం వెంకరెడ్డిని, అతన్ని ఆడిస్తున్న పెద్దిరెడ్డి, ఇసుకాసురుడు జగన్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు
అమరావతి: చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు.. ఫైబర్ నెట్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులకు సంబంధించి ఒక్క సాక్ష్యాధారం కూడా ప్రజలముందు, న్యాయ స్థానా ల ముందు ఉంచలేక.. ప్రజల్ని నమ్మించడానికి నానా తిప్పలు పడుతున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లోనే వెల్లడయిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గలేదన్న అక్కసు తో నాలుగు రోజుల క్రితం మద్యం కేసు పెట్టిన జగన్ సర్కార్ తాజాగా ఆయనపై ఇసుక కేసు పెట్టిందని దుయ్యబట్టారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం సాయంత్రం పట్టాభి విలేకరులతో మాట్లా డుతూ జగన్ ప్రభుత్వం తాజాగా చంద్రబాబుపై ఇసుక కేసు నమోదు చేసిందన్నారు. మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్ర బాబుపై కొత్తగా ఎఫ్.ఐ.ఆర్: 19/2023ని నమోదు చేశారు. ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇసుక టెండర్లలో జరుగుతున్న గోల్‌మాల్‌కు ప్రధాన సూత్రధారి. జగన్మో హన్‌రెడ్డి ఇసుక మాఫియాతో రూ.40వేల కోట్లు మింగే యడం వెనకున్న ప్రధాన పాత్రధారి. వెంకటరెడ్డి పెద్ద అవినీతి తిమింగలం. ఇంకా చెప్పాలంటే తిమింగలం కంటే ఎక్కువే. అలాంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం.. ఈ ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వెంకటరెడ్డి అక్టోబర్ 3 న ఫిర్యాదు చేస్తే.. నవంబర్ 1వ తేదీన జగన్‌సర్కార్ రూపొందించిన ఎఫ్.ఐ.ఆర్‌లో ప్రధానంగా.. చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాడు.. అలా అందించడమే నేరం.. అని పేర్కొ న్నారు. ఇసుకాసురుడు జగన్‌రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు ఇసుక దోపిడీ చేయలేదు కాబట్టి, జగన్ లాగా రూ.40వేల కోట్లు కొట్టేయలేదు కాబట్టి, ప్రజల కు ఉచితంగా ఇసుక అందించాడు కాబట్టి.. అది ఈ సైకో ముఖ్యమంత్రి దృష్టిలో, అవినీతి తిమింగలం వెం కటరెడ్డి దృష్టిలో పెద్ద నేరం అని పట్టాభి విమర్శించారు
చంద్రబాబునాయుడు ఉచితంగా ప్రజలకు ఇసుక అందించడం వల్ల.. ప్రభుత్వానికి సీనరేజ్.. టెండర్ల వేలం రూపంలో వచ్చే వేలకోట్లు రాకుండా పోయాయ ని, దానివల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్రమైన నష్టం జరి గిందని ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. అలానే ఎఫ్.ఐ. ఆర్‌లో గత ప్రభుత్వం విడుదలచేసిన కొన్ని జీవోలను కూడా ఉదహరించారు. వాటిలో ప్రధానంగా ఇసుక రీచ్ లకు సంబంధించి చంద్రబాబునాయుడు సమీక్ష చేసి, ఇసుక రీచ్‌లను డ్వాక్రాసంఘాలకు అప్పగిస్తూ… జీవో నెం- 94ని 2014 ఆగస్టు 28న విడుదల చేశా రు. ఆ జీవోలో చాలా స్పష్టంగా నాటి టీడీపీ ప్రభుత్వం ఏపీఎండీసీని నోడల్‌ఏజెన్సీగా నియమించి,దాని ద్వారా మహిళా సమాఖ్యలకు ఇసుక రీచ్‌లు అప్పగించాలని.. తద్వారా వచ్చే లాభాలలో 25శాతం ఆదాయం మహి ళా సంఘాలకు దక్కేలా చేయాలని ఆదేశించారు. మహి ళలు తమకాళ్లపై తాము నిలబడేలా.. ఆర్థికంగా నిల దొక్కుకునేలా వారికి రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లు కట్ట బెట్టడమే జగన్ రెడ్డి దృష్టిలో చంద్రబాబు చేసిన నేరం. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగించాక.. ఆనా డు కూడా జగన్‌రెడ్డి… అతని అవినీతిపార్టీ అత్యంత దారుణంగా మహిళా సమాఖ్యల ముసుగులో ఇసుక దోచేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేయడంతో..నాటి ప్రభుత్వం మరలా దానిపై సమీక్ష చేసి 2016, జనవరి 1వ తేదీన జీవో నెం-20ని విడుదల చేసింది. జీవో నెం-20లో ఇసుకకు సంబంధించి ఆక్షన్ విధానంలో టెండర్లు పిలవాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా క్యూబిక్ మీటర్ రూ.550లకు అంటే టన్ను ఇసుక సుమారుగా రూ.344 లకు మించకుండా ఇసుక రీచ్‌లు నిర్వహించాలని.. దానికి సంబంధించి టెండర్లు పిలవాలని నిర్ణయించుకున్నాకే నాటిప్రభుత్వం జీవో నెం-20ని విడుదల చేసింది.
ఆ తరువాత కూడా అనేకరకాలుగా వైసీపీ పదేపదే పనిగట్టుకొని మరీ నిరాధార ఆరోపణలు ఇసుక తవ్వ కాలపై చేస్తుండటంతో చివరకు నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ప్రజలకు అందివ్వాలనే నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా అంతకు ముందు ప్రారంభించిన ఇసుకటెండర్ల ప్రక్రియను జీవో నెం-43 ద్వారా రద్దుచేసింది. 2016 మార్చి 2 నుంచి ఇసుకను పూర్తి ఉచితంగా ప్రజలకు అందిద్దామనే ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఉచిత ఇసుక విధానం కోసం చంద్రబాబు ప్రభుత్వమిచ్చిన జీవో నెం-43లో అప్పటివరకు అమల్లోఉన్న అన్ని జీవోలను రద్దుచేస్తు న్నట్టు పేర్కొంది. అలానే గతంలో టెండర్ ప్రాసెస్ లో పాల్గొన్నవారికి వారు చెల్లించిన నిర్ణీత రుసుముని కూడా వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం సదరు జీవోలో పేర్కొంది. అంతేగాకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసేవారిపై భారీగా పెనాల్టీలు వేసేలా, అలా చేసే వారికి జైలు శిక్షలు పడేలా జీవోనెం-42, జీవోనెం-35 విడుదల చేసింది.
మహిళలు బాగుపడటం… ఆర్థికంగా బలపడం ఈ సైకో ముఖ్యమంత్రికి ఇష్టం లేదు
ఇవన్నీ గమనిస్తే… చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలు ఆర్థికంగా బలపడాలన్న సదుద్దేశంతో తొలుత రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను డ్వాక్రా సంఘాలకు కట్టబెట్టే ఆలోచన చేస్తే…దాన్ని ఈ సైకో జగన్ రెడ్డి..అతని పార్టీ తప్పుపట్టాయి. మహిళలు బాగుపడటం ఈ జగన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టే…దాన్ని కూడా తప్పు పట్టారు. సరేలే అని తర్వాత పారదర్శకంగా టెండర్లు పిలిచి.. ఇసుక రీచ్ లు నిర్వహిద్దామనుకుంటే ఆ విధానంపై కూడా రకరకాల విమర్శలు చేశారు. దాంతో ఇవన్నీ కాదని దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలకు ఉచితంగా ఇసుక ఎందుకివ్వకూడదని ఆలోచించి చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకుంటే.. దాన్ని కూడా తప్పుపడుతూ.. ఈ ఇసుకాసురుడు జగన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టించాడు. చంద్రబాబునాయుడు ప్రజలకు ఉచితంగా ఇసుక అందివ్వడం అన్యాయం అంటున్న ఈ సైకో ముఖ్యమంత్రి.. ఈ అవినీతి ప్రభుత్వం ఏది న్యాయమో చెప్పాలి. నాలుగేళ్లలో ఇసుకదోపిడీతో రూ.40వేలు కోట్లు మింగేయడం న్యాయమా? గతంలో టీడీపీ ప్రభుత్వంలో రూ.1200 నుంచి రూ.1500లకు దొరికిన ట్రాక్టర్ ఇసుకను ఈ ఇసుకాసురుడు రూ.5వేల నుంచి రూ.8 వేలకు అమ్ముకోవడం న్యాయమా? లారీ ఇసుకను రూ. 40 నుంచి రూ.50 వేలకు అమ్ముకోవడం ధర్మమా? మంత్రి పెద్దిరెడ్డి.. ఇతర మంత్రులు..వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించి జేబులు నింపుకోవడం న్యాయమా? జగన్ రెడ్డి దృష్టిలో దోపిడీయే న్యాయం.. ధర్మమని పట్టాభి దుయ్యబట్టారు.
దళిత మహిళ పీతల సుజాత ఏం తప్పు చేసిందని ఏ-1గా పెట్టారో ముఖ్యమంత్రి చెప్పాలి
ఇసుకకు సంబంధించి ఈ సైకో రెడ్డి పెట్టించిందే తప్పుడు కేసు అయితే.. దానిలో దళిత మహిళను ఏ-1 గా చేరుస్తారా? పీతల సుజాత ఏం తప్పు చేసిందని ఆమెపై కేసు పెట్టారు? ఇసుకాసురుడు జగన్ రెడ్డి తొత్తుగా మారి రాష్ట్రంలోని ఇసుకను పప్పు బెల్లాల్లా మింగేస్తున్న పుంగనూరు పెద్దిరెడ్డిని వదిలేసి దళితమహిళను అన్యాయంగా మీ కక్ష సాధింపులకు బలిచేయాలని చూస్తారా? పీ.ఎల్.ఆర్ అనే స్టిక్కర్ ఉంటే చాలు.. వందలాది ఇసుక లారీలు నేరుగా ఏపీ నుంచి బెంగుళూరుకు తరలిపోతున్నాయి.. అవేవీ వెంకటరెడ్డికి కనిపించడం లేదా? ఏ-1 పీతల సుజాత అయితే.. ఏ-2 చంద్రబాబు..ఏ-3 చింతమనేని ప్రభాకర్.. ఏ-4 దేవినేని ఉమామహేశ్వరరావులా? దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన తప్పేంటయ్యా అంటే నిత్యం ఈ ప్రభుత్వ దోపిడీ.. అవినీతిని ప్రశ్నించడం. దేవినేని ఉమాపై తప్పుడు కేసు పెట్టించడం కాదు.. మైలవరం వీరప్పన్ వసంత కృష్ణ ప్రసాద్ పై పెట్టాలి. దమ్ముంటే ఇసుక దోపిడీలో మునిగితేలుతూ వందలకోట్లు మింగేస్తున్న వైసీపీనేతలు..మంత్రులపై కేసులు పెట్టాలని పట్టాభి డిమాండ్ చేశారు.
తప్పుడు కేసులతో జగన్‌రెడ్డి.. చంద్రబాబుని వేధించి తన రాజకీయ కుట్రలు అమలు చేస్తున్నాడని ప్రజలు గ్రహించారు కాబట్టే.. ఆయనకు నాలుగు రోజుల క్రితం బ్రహ్మరథం పట్టారు. రాజమహేంద్ర వరం నుంచి విజయవాడకు రావడానికి చంద్రబాబుకి 14 గంటల సమయం పట్టడంతో జగన్ రెడ్డికి..సజ్జల రామకృష్ణారెడ్డికి పిచ్చిపట్టినట్టైంది. ఆ పిచ్చితోనే రోజుకో తప్పుడు కేసుని తెరపైకి తెస్తున్నారు.
చంద్రబాబు తీసుకొచ్చిన ఉచిత ఇసుకవిధానం రద్దుచేసిన జగన్.. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అనేకంపెనీకి ఇసుకరీచ్ లు అప్పగించి, దాన్ని అడ్డంపెట్టుకొని ఇష్టానుసారం దోపిడీ చేశాడు. ఇసు క ద్వారా నాలుగున్నరేళ్లలో రూ.40 వేలకోట్లు మింగిన జగన్ రెడ్డి.. కొత్తగా తమ్ముడు అనిల్ రెడ్డికి..తన బినామీలకు ఇసుక రీచ్ లు అప్పగించడానికి కొత్త టెండర్లు పిలవడానికి సిద్ధమయ్యాడు. ఇసుక రీచ్ లలో కేవలం నగదు చెల్లింపులకు మాత్రమే ఎందుకు అనుమతిచ్చాడో జగన్ సమాధానం చెప్పాలి. జగన్ ఇసుక దోపిడీపై సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్ చేసిందని.. గతంలో ఇసుకాసురుడి ఇసుక దోపిడీని చంద్రబాబునాయుడు ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచారన్న అక్కసుతోనే ఈ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టింది. ఇసుక, లిక్కర్ అంశాలకు సంబంధించి తప్పుడుకేసులు పెట్టిన జగన్ రెడ్డి.. తన తాడేపల్లి కొంపకు తానే నిప్పంటించుకున్నాడు. వాటికి సంబంధించి ఈ ప్రభుత్వం నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్ లే భవిష్యత్‌లో జగన్మోహన్ రెడ్డిని దహిస్తాయని పట్టాభి హెచ్చరించారు.
వెంకటరెడ్డిని వదిలే ప్రసక్తే లేదు, జగన్ పిచ్చి సజ్జలకు అంటింది
తప్పుడు కేసు పెట్టిన వెంకటరెడ్డి.. ఏదో ఘనత సాధించానని చంకలు గుద్దుకుంటే ఈ రోజుతో పోదు. వెంకటరెడ్డిని వదిలే ప్రసక్తే లేదు. తాడేపల్లి కొంపలోని వారి మోచేతి నీళ్లు తాగుతూ.. వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి చేసే ప్రతిపని.. తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్ లో వారి మెడకే చుట్టుకుంటుంది. రాష్ట్రంలో జరిగే ఇసుక మాఫియా పై సీబీఐ విచారణ జరిగేవరకు.. టీడీపీ ఈ అంశాన్ని వదిలిపెట్టదు. ప్రతిదానికి మీడియా ముందుకొచ్చి మాట్లాడే సజ్జల సమస్య ఏమిటో అర్థమైంది. తాడేపల్లి ప్యాలె స్ లో ఉండే సైకో పిచ్చి ఆయనకు కూడా బాగా వంటపట్టినట్టుంది. అందుకే రోజూ మీడియా ముందుకొచ్చి పిచ్చికూతలు కూస్తున్నాడు. ఈ పిచ్చి తగ్గాలంటే.. భారతి రెడ్డిని అడిగి.. జగన్ పిచ్చితగ్గడానికి వాడే మందులు వాడాలి. లేదంటే జగన్ రెడ్డి మాదిరే.. లండన్ వెళ్లి పిచ్చి తగ్గించే డాక్టర్ల వద్ద చికిత్స పొందాలి. సజ్జల తన కడుపు మంట తగ్గడానికి కూడా జెలుసిల్, సుక్రాల్ సిరప్ లాంటివి వాడితే మంచిదని పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు.
ఎన్జీటీ నివేదికను పూర్తిగా చదివే .. చంద్రబాబుపై ఫిర్యాదు చేశావా వెంకటరెడ్డి?
చంద్రబాబునాయుడి హయాంలో ఇసుకతవ్వకా లపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా స్పందించిందని కూడా సైకో జగన్.. చంద్రబాబు పై నమోదు చేయించిన తప్పుడు ఎఫ్.ఐ.ఆర్‌లో ప్రస్తావి స్తూ, ఎన్.జీ.టీ కంప్లైంట్ నెం-935/2018ని ప్రస్తా వించారు. జగన్ ప్రభుత్వం ఎఫ్.ఐ.ఆర్‌లో పేర్కొన్న ఎన్.జీ.టీ కంప్లైంట్‌కు సంబంధించిన తుదితీర్పుని ఎన్.జీ.టీ 2020, ఆగస్టు 24న ఇచ్చింది. ఆ తుది తీర్పులో చాలా స్పష్టంగా ఎన్.జీ.టీ తాము గతంలో నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో పూర్తిగా సంతృప్తి చెందామని, ఇంకా అదనంగా ఎలాంటి నివేదికలు ఇవ్వాల్సిన పనిలేదని అభిప్రాయ పడుతూ.. నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొన్న అంశాన్ని ఎన్.జీ.టీ తన తీర్పులో ప్రస్తావించింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తుది నివేదికను తొక్కిపెట్టి, వెంకటరెడ్డి తప్పు డు ఫిర్యాదు చేయడం.. ఈ సైకో ముఖ్యమంత్రి తప్పుడు కేసు పెట్టడం.. ఇదీ వీళ్ల వరస అని పట్టాభి విమర్శించారు.
గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అంతా పారదర్శకంగా అమలైతే.. జగన్ రెడ్డి ఇసుకదోపిడీపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్నిసార్లు హెచ్చరించిందో, ఎన్నివందలకోట్ల జరిమానా జగన్ ప్రభుత్వానికి విధించిందో లెక్కేలేదు.
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పర్యావరణ అనుమతులు ఇచ్చిన పరిధిదాటి అదనంగా ఇసుక తవ్వకాలు జరిపారని నిర్ధారిస్తూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతజిల్లా చిత్తూరులో అక్రమ ఇసుక రవాణాపై రూ.18 కోట్ల జరిమానా విధించిన మాట వాస్తవంకాదా? కంప్లైంట్ నెం 152 /2021, 53/2022, 187/2021లలో ఎన్.జీ.టీ ఇచ్చిన ఉత్తర్వులపై వెంకటరెడ్డి ఏం సమాధానం చెబుతాడు. 2019జూన్ తర్వాత ఎన్.జీ.టీ ఉత్తర్వుల పై ఈ సైకో ప్రభుత్వం ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయదా..పరిధికి మించి ఇసుక తవ్వకాలు జరిపిన మంత్రి పెద్దిరెడ్డిని.. వైసీపీ నేతల్ని శిక్షించదా? సాక్షా త్తూ మంత్రి సొంతజిల్లాలో జరిగే ఇసుకదోపిడీ.. మంత్రి నిర్వాకాలు ముఖ్యమంత్రికి తెలియవా? గుం టూరు జిల్లాకు చెందిన నాగేంద్రకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్.జీ.టీ కంప్లైంట్ నెం-187/2021కు సంబంధించి ఇచ్చిన ఆర్డర్లోని ఆదేశాలపై వెంకటరెడ్డి ఏం సమాధానం చెబుతాడు? ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రై బ్యునల్ ఆదేశించినా ఎందుకు నిలుపుదల చేయలేదో వెంకటరెడ్డి చెప్పాలి.రాష్ట్రంలో జరిగే ఇసుకతవ్వకాలు అన్నీ సక్రమమే అయితే ఎన్.జీ.టీ ఇసుక తవ్వకాలు ఆపేయమని ఎందుకు ఆదేశించిందో, కోట్లరూపాయ ల జరిమానాలు ఎందుకు విధిస్తుందో ముఖ్యమంత్రి, మంత్రి సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.