హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ టీఎస్ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గత రెండు మాసాలుగా జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపారు. పార్టీ సభ్యత్వ నమోదు చాలా ప్రోత్సాహకరంగా సాగుతున్నది. అశ్చర్యకరంగా కొత్త సభ్యత్వాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మహానాడు సభ విజయం తరువాత ముఖ్యంగా యువకులలో తెలుగుదేశం పార్టీయే ప్రత్యామ్నాయమని అభిప్రాయానికి వస్తుండడం శుభసూచికమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి చేరికలు జరగబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా పార్టీని వీడిన మాజీ నాయకులకు, నూతన నాయకులకు తెలుగుదేశం పార్టీ ఒక వేదిక కాబోతున్నది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను పార్టీ నిర్ణయించడం జరిగింది. నూతన చేరికలు, యువకులకు సరైన స్థానం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యకక్షులు సామా భూపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు.