హైదరాబాద్: ఎన్టీఆర్ భవన్లో టీడీపీ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు అధ్యక్షతన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదుకు కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా సమీక్షించడం జరిగింది. సభ్యత్వ నమోదును మరింత వేగవంతంగా చేయడం కోసం చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించడం జరిగింది. దీనిలో భాగంగా 18తేదీన రాష్ట్ర కార్యవర్గం, ఇన్ఛార్జులు మరియు అనుబంధ సంఘాలతో టెలికాన్ఫరెన్స్ను నిర్వహించి టీడీపీ-టీఎస్ అధ్యక్షులు బక్కని నర్సింహులు దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 24వ తేదిన ఖమ్మం జిల్లాలోనే పాతర్లపాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జాతీయపార్టీ అధ్యకక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హజరై విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఎన్టిఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టిఆర్ విగ్రహావిష్కరణ కోసం జాతీయ పార్టీ అధ్యక్షులు రానున్నందున ఆయనకు ఘనంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.