అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వైసీపీ నేత వెంకట్రావు చేసిన వ్యాఖ్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన తెలుగు మహిళలు . దీంతో పోలీసులు వారిని అడ్డుకొని బారికేడ్లు అడ్డుపెట్టడం జరిగింది. బారికేడ్లు వద్ద తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చoగల వెంకటారావు, వైసీపీ మహిళా నేత రోజారాణిపై డీజీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ…అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనితకు వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
విజయవాడ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ… మహిళలు నుంచి ఫిర్యాదు తీసుకునేందుకే ప్రభుత్వం భయపడుతోందన్నారు. మహిళల్ని అవమానించటమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందని మండిపడ్డారు.
పోలీసు బెదిరింపులకు భయపడమని, వైసీపీ నేతల తీరు ఇలానే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతామని తెలుగు మహిళ అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష స్పష్టం చేశారు.