అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డిఎ అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా కె.ఆర్. నారాయణన్, ఏ.పి.జె. అబ్దుల్ కలాం గార్లలను టిడిపి బలపరిచింది. లోక్ సభ స్పీకర్‌గా బాలయోగిని, శాసనసభ స్పీకర్‌గా ప్రతిభా భారతిని టిడిపి ఎంపిక చేసింది. కేంద్రమంత్రిగా కింజరాపు ఎర్రంనాయుడిని నాడు తెలుగుదేశం ఎంపికచేసి సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. అలాగే పార్టీలకు అతీతంగా తెలుగు బిడ్డ పి.వి. నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచింది. తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం టిడిపి ముందు వరుసలో నిలబడిరదని చంద్రబాబు పేర్కొన్నారు.