• కాకినాడ ఘాటీ సెంటర్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• వైసీపీ అధికారంలోకి వచ్చాక రవాణా అధికారులు గ్రీన్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ రూపాల్లో రవాణావాహనాలను దోచేస్తున్నారు.
• రైత్వారీ లోడ్ లకు కూడా ఏదో ఒక కారణం చూపి రూ.30వేలు జరిమానా విధిస్తున్నారు.
• డీజిల్ ధరలు పెరుగుదల, కిరాయి ధరలు తక్కువ అవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం.
• కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి చెందిన లారీ ఓనర్లను సంఘం సభ్యత్వం తీసేసి వేధిస్తున్నాడు.
• మీరు అధికారంలోకి వచ్చాక లారీ ఓనర్లను ఆదుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలన కారణంగా రవాణారంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
• ఇదివరకెన్నడూ లేనివిధంగా అడ్డగోలుగా ట్యాక్సులు పెంచడంతో ఓనర్లు డ్రైవర్లుగా మారిపోయారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వంలో పెంచిన పన్నులను సమీక్షించి లారీఓనర్లకు ఉపశమనం కలిగిస్తాం.
• లారీఓనర్స్ యూనియన్ లో రాజకీయ జోక్యానికి చెక్ పెడతాం, యూనియన్లలో తలదూర్చి ఇబ్బందులకు గురిచేసే దోపిడీ దొంగలకు షాక్ ట్రీట్ మెంట్ ఇస్తాం.
• వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వాహనాలపై ఆంక్షలను తొలగిస్తాం.