చీపురుపల్లి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అందరి మాదిరి నన్ను కూడా భయపెట్టాలని చూశారు… నీలాంటి రౌడీలకు భయపడను…ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా… మళ్లీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రజలపక్షాన పోరాడుతుంటే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు…నేనొక పిలుపు ఇస్తే నీ ప్రభుత్వం ఎక్కడకు వెళ్తుందో చూసుకో… నా మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వరా… ఖబడ్దార్ జాగ్రత్తగా గా ఉండు..ఇంట్లోనుంచి బయటరాలేరు…రోడ్లపై కూడా తిరగలేరు తీవ్రంగా హెచ్చరించారు. జగన్ రెడ్డి పరదా గట్టుకొని తిరుగుతున్నాడు… ధైర్యముంటే జనం ముందుకు రా… ఒక్క చాన్స్ అడిగారడు…ముద్దులు పెట్టాడు… ఇప్పుడు పిడుగుద్దులు గుద్దుతున్నాడని అన్నారు. బుద్దున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఇన్ని భారీగా పన్నులు పెంచుతారా అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్రం కోసం చివరివరకు పోరాడతా… అందరం కలసి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బాదుడు బాదుడే రోడ్ లో శుక్రవారం రాత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… మూడేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు. బాబాయ్ హత్య కేసు, కోడికత్తి ఏమైందో జగన్ రెడ్డి చెప్పగలడా? మళ్లీ ఇలాంటి వ్యక్తులు గెలిస్తే జనం రాష్ట్రం వదిలి పారిపోవాల్సి వస్తుందని అన్నారు.
జనప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయం
చీపురుపల్లి దద్దరిల్లిపోతోంది… ఈ ఉత్సాహం జీవితంలో చూడలేదు… ఎక్కడ చూసినా జనప్రవాహం… ఎవరైనా అడ్డొస్తే కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు. ఎందుకు ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది? నువ్వు చేసే తప్పుడు పనులకు ప్రజలముందు దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. ఈ జనాన్ని చూశాక బొత్సకు,ముఖ్యమంత్రికి నిద్రపట్టదు… మీరు చేసిన పాపాలు ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పెట్రోలు, డీజిల్ దేశంలో ఎక్కడైనా ఇంత ధరలున్నాయా? నేనే ఆడబిడ్డలకు దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు ఇస్తే ఈ ముఖ్యమంత్రి దీపం ఆర్పేశాడని తెలిపారు. నిత్యావసరాలు కొనే పరిస్థితుల్లో ఉన్నారా? మీలో బాదుడు నుంచి ఎవరికైనా మినహాయింపు ఉందా? అందరూ జగన్ రెడ్డి బాదుడు బాధితులేనని చెప్పారు. కరెంటుచార్జిలు పెంచుతూనే ఉన్నారు. రాని కరెంటుకు బిల్లలు మోత మోగిస్తున్నారని అన్నారు.
ప్రజలంతా కలసి తిరుగుబాటు చేయండి!
పాలన తెలియని వాడికి సిఎం పదవి కట్టబెట్టారు… రివర్స్ పాలన సాగిస్తున్నాడు… అందరం. అనుభవిస్తున్నాం… ఈ ముఖ్యమంత్రిని సాగనంపడమే దీనికి పరిష్కారమని చంద్రబాబు పేర్కొన్నారు. మళ్లీ బస్ చార్జీలు మళ్లీ పెంచుతాడు. బాదుడే బాదుడు. నువ్వు బాదుతా ఉంటే బాధపడాలా… ప్రజలంతా కలసి తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు… జె.బ్రాండ్ల మద్యం మానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ అంతా జగన్ దే. ఎన్నికల్లో మద్యపాన నిషేధమని చెప్పి పంగనామాలు పెట్టలేదా? మోసకారి ఈ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. మీ రక్తాన్ని తాగే జలగ జగన్… మళ్లీ 2025వరకు బార్ల లైసెన్సులు పొడిగించారు… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈయనను చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేయడం ఖాయమని అన్నారు. బాబాయ్ ని చంపింది నేనా, జగన్మోహన్ రెడ్డా… మొదట గుండెపోటని చెప్పి తర్వాత గొడ్డలిపోటు వేసిందెవరని ప్రశ్నించారు.
కేంద్రం మెడలు వంచుతానని చెప్పి కాళ్లబేరం!
తమను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు… ఇప్పుడుమెడలు వంచారా, మెడలుదించి కాళ్ల బేరానికి వచ్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇదంతా కేసుల కోసం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్ ను చంపి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు ఇచ్చి అంత్యక్రియలు చేసుకోమన్నారు. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి… ఎక్కడున్నా తీసుకొచ్చే శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్ ప్లాన్ పెట్టి ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా? ఆ డబ్బంతా దోచుకొని తినేశారు. లెక్కలు చెప్పే పరిస్థితి లేదని అన్నారు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. లిస్టు ఆన్ లైన్ లో పెట్టే ధైర్యం జగన్ రెడ్డి కి ఉందా అని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఏరైతానా బాగున్నాడా… క్రాప్ హాలిడే ప్రకటిస్తే తెలుగుదేశం చేయించిందంటారా… మీ భార్య కాపురం చేయకపోయినా నేనే బాధ్యుడినా అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.
సామాజిక న్యాయమంటే సొంతవారికి కట్టబెట్టడమా?
ఉత్తరాంధ్ర బిసిలకు కంచుకోట… పార్టీ ఆవిర్భావం నుంచి వారే వెన్నెముక… సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల్లో టిడిపి 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే వైసిపి ప్రభుత్వం దానిని 24శాతానికి తగ్గించారని అన్నారు. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఎందుకని నిలదీశారు. టిడిపి హయాంలో కళావెంకట్రావు, యర్రన్నాయుడు, ప్రతిభాభారతి వంటివారికి పదవులు ఇచ్చాం… ఎవరిది సామాజిక న్యాయమని ప్రశ్నించారు. సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్… అందుకు ప్రతిరూపం ఎన్టీఆర్ అని అన్నారు. వైసిపి హయాంలో ఇచ్చింది నవరత్నాలు కాదు… నవ ఘోరాలు జరిగాయి. గనులు, ఇసుక, భూకబ్జాలు, మద్యం మాఫియా, హత్యలతో రాష్ట్రాన్ని అతకాకుతలం చేశారని చెప్పారు.
అన్ని లెక్కలూ రాస్తున్నాం…వడ్డీతో చెల్లిస్తాం!
తప్పుడు పనులు చేస్తున్న వైసిపి నేతల లెక్కలన్నీ రాస్తున్నాం… అధికారంలోకి వచ్చిన వెంటనే చక్రవడ్డీతో తిరిగి ఇస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు దోపిడీ చేసిన వదలొద్దు… నిలదీయండి… వారంతా మళ్లీ ఈ భూమిపైనే తిరగాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా వైసిపి నేతలు అర్థం చేసుకొని ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. ఈ క్షణం నుంచే ప్రజలంతా పోరాటానికి సిద్ధం కండి… ఇంటికొకరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలోకి రండి… వీరోచితంగా పోరాడి మనల్ని బాధపెట్టిన వారిని సంగతి చూద్దామని అన్నారు. నేను మీకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
విశాఖలో ఆస్తులపైనే జగన్ రెడ్డి ప్రేమ
ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి విశాఖపట్నంపై ప్రేమ లేదు… ఆయన ప్రేమంతా విశాఖలో ఉన్న విలువైన ఆస్తులపైనేనని చంద్రబాబునాయుడు తెలిపారు. ఇదిచాలా భయంకరమైన పరిస్థితి. రుషికొండ కొట్టేయాలని ప్లాన్ చేసిన దుర్మార్గుడు జగన్… రుషికొండను గుండుకొట్టించాడని అన్నారు. దోచుకున్న సొమ్ముతో రేపు ఓటుకు పదివేలు ఇస్తామని మభ్యపెడతాడు.. ప్రజలంతా చైతన్యవంతులై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని బాగుచేసుకోవడానికే క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్ పిలుపునిచ్చాం… జగన్ రెడ్డి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగినపుడే ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అప్పుడే రోడ్ల గుంతలన్నీ పూడతాయని చంద్రబాబు పేర్కొన్నారు.