న్యూఢల్లీ: మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢల్లీకి వచ్చానన్నారు. పార్టీ పెద్దలను కలిసి చెప్పాల్సింది చెప్పాను.. ఏడు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచానన్నారు. పార్టీని ఎప్పుడూ వీడలేదు, బయట నుంచి రాలేదన్నారు. ప్రతి ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయన్నారు. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌పై ఇంత వ్యతిరేకత లేదన్నారు. ఇప్పుడు చాలా వ్యతిరేకత పెరిగిందన్నారు.70కి పైగా స్థానాలు వస్తాయని అనుకున్నాం.. 64 సీట్ల దగ్గర ఆగిపోవడం నిరాశ పరిచింది. నేను, నా భార్య ఎప్పుడూ క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటాం. తెలంగాణ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్‌గా లేను కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేదన్నారు. నాకిచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహించాను. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాం. పార్టీ విధేయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా. హైదరాబాద్ లో తుడిచిపెట్టుకుపోయాం. హైదరాబాద్ లో ఇలాంటి ఫలితం వస్తుందని అనుకోలేదు. సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సారం జరగలేదు. ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా దాటకుండానే పార్టీ అధిష్టానం నిరణయం తీసుకుందని ఉత్తమ్ అన్నారు.