- చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని పొన్నవోలు విపరీత పోకడలు
- జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసమే చట్టవిరుద్ధ చర్యలు
- స్కిల్ కేసులో విస్మయకరంగా పొన్నవోలు విన్యాసాలు
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిం చడమే లక్ష్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.స్కిల్ కేసులో అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యవహరించిన తీరు, చంద్రబాబు నాయుడి బెయిల్ తీర్పుపై పొన్నవోలు చేసినవ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయంటూ టీడీపీ బృందం బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డిని కలిసి పిర్యాదుచేసింది. ఆ వివరాలను వర్ల రామయ్య మీడియాకు వివరిస్తూ ‘టార్గెట్ చంద్రబాబు’ అన్న జగన్‌రెడ్డి లక్ష్యం కోసం చెప్పినట్లు వింటాడని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని అదనంగా సృష్టించుకున్నారన్నారు. చంద్రబా బునాయుడిపై తప్పుడు కేసులుపెట్టి తప్పుడు సాక్ష్యా లు సృష్టించడమే ఏఏజీ ప్రధాన విధి. ఏఏజీ చర్యల న్యీ ఆవిధంగానే ఉన్నాయి. అడ్వకేట్ జనరల్(ఏజీ)గా ఉన్న శ్రీరాం చట్టపరిధిలో వ్యవహరిస్తూ.. ప్రభుత్వ చట్టవ్యతిరేక కార్యక్రలాపాలను సమర్థించడం లేదు. అందుకే ఏఏ జీ పదవి సృష్టించారు. పొన్నవోలు తీరు చూస్తుంటే బానిసలుసైతం విస్మయంచెందేలా ఉంది. పొన్నవోలు జగన్‌రెడ్డి కాళ్ల దగ్గర పడిపోయారు. చంద్రబాబు నాయుడిని జనం దృష్టిలో ఒక ముద్దా యిగా చూపిం చేందుకు పొన్నవోలు ఎంతో తాపత్రయపడుతున్నారు. జగన్‌రెడ్డి కళ్లల్లో ఆనం దం కోసమే ఏఏజీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నా రు.స్కిల్కేసులో పొన్నవోలుచేసిన విన్యాసాలు న్యాయ కోవిదులకే విస్మయం కలిగిస్తున్నాయి. విచారణాధికా రులు ఏర్పాటుచేసే పత్రికా సమావేశాల్లో ప్రభుత్వ అడ్వకేట్లు మాట్లాడటం ఏపీలోనే చూస్తున్నాం. గతం లో ఏజీలు, ఏఏజీలు పత్రికా సమావేశాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. జగన్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం సిఐడీ నిర్వహిస్తున్న అన్ని పత్రికా సమావేశాల్లో పొన్న వోలు మాట్లాడుతున్నారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు చాలా సునిశితంగా పరిశీలించి చంద్ర బాబునాయుడికి బెయిల్ మంజూరు చేస్తే ఆ తీర్పు ఇచ్చిన జడ్జిని తప్పుపడుతూ ఏక వచనంతో పొన్నవో లు మాట్లాడారు. తీర్పుపై పొన్నవోలుకు అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాలి. అంతేగా నీ… న్యాయమూర్తులను కించ పరిచేలా మాట్లాడటం సరికాదు.న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించ పరిచేలా మాట్లాడుతూ, సీనియర్ రాజకీయనాయకు డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యా ఖ్యలు చేయడం న్యాయస్థా నాలను ధిక్కరించడమే. అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా పొన్నవోలును నియ మించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే.అందుకే సీఎస్ కు పిర్యాదుచేశాం. పొన్నవోలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. తన బాధ్యతల పరిధిని దాటి మాట్లాడా రు. పొన్నవోలును సస్పెండ్ చేసి ఆయనపై వెంటనే కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి. న్యాయవ్యవ స్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకరంగా మాట్లాడి న పొన్నవోలుకు ఒక్కరోజు కూడా ఏఏజీగా కొనసాగే నైతికహక్కు లేదు. జగన్మోహన్రెడ్డి కళ్లలో ఆనం దం చూడటం కోసం విపరీత పోకడలు పోతున్న పొన్నవోలును తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు. పార్టీ తరపున ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తాం. అపాయింటింగ్ అథా రిటీగా ప్రభుత్వం తరపున సీఎస్ కూడా పొన్నవోలు పై కేసు నమోదు చేయాలి. అధికారులు తమ పరిధి దాటి వ్యవహరిం చకూడదని హెచ్చరిస్తున్నాం. రాబో యే తెలుగుదేశం ప్రభుత్వంలో తమ పరిధి దాటి వ్యవహరించిన అధి కారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. సీఎస్‌ను కలిసిన టీడీపీ బృందంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, రాష్ట్ర కార్య దర్శి దేవతోటి నాగరాజు, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపా ధ్యక్షుడు కోడూరి అఖిల్, తదితరులు పాల్గొన్నారు.