.మాకు ఫోన్ చేస్తే న్యాయవాదులను పంపిస్తాం
.24 గంటలూ అందుబాటులో లీగల్ టీమ్
అమరావతి : రాష్ట్ర ప్రజానీకానికి విజ్జప్తి చేస్తున్నా. 41ఏ నోటీసు తీసుకొని పోలీసులు అర్థరాత్రి మీ ఇళ్లపైకి వస్తే మాకు చెప్పండి. 24I7 మా లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుంది. మా లాయర్లను పంపిస్తాం. ఒకవేళ నోటీసు ఇస్తే లాయర్ సమక్షంలో మాత్రమే నోటీసులు తీసుకోండి. పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే మాకు ఫోన్ చేయండి. మా కార్యకర్తలను పంపిస్తాం. అందరం కలిసి సంబంధిత పోలీసులను నిలదీద్దాం. అధికారం శాశ్వతం కాదు…పోలీసుల అరాచకాలన్నీ రికార్డు చేస్తున్నాం. ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. విచారణ సమయంలో అడ్వొకేట్ ను రాకుండా చేయడానికి మీకు ఏ అధికారం ఉంది? గోడలు దూకే అధికారం ఎవరు ఇచ్చారు? గ్రేట్ సీబీసీఐడీ సమాధానం చెప్పాలి. మీరు చేస్తున్న తప్పులతో పోల్చుకుంటే వెంకటేష్, సాంబశివరావు చేసింది అసలు తప్పే కాదు.