విజయవాడ: ఫైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల జప్తు కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నిందితుల ఆస్తులు అటాచ్ (జప్తు) చేసేందుకు అనుమతించాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరారు. సీఐడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయకముందు కొనుగోలు చేసిన ఆస్తులను ఎలా అటాచ్ చేస్తారని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడినవారి ఆస్తులు ఎప్పటికైనా అటాచ్ చేసే అధికారం ఉందని సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.