కోడుమూరు: జగన్ సర్కార్ జె – ట్యాక్స్ బాదుడుతో రాష్ట్ర ప్రజల బతుకులు బుగ్గి పాలయ్యాయని… కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ… ఆందోళన చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోడుమూరులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం ఇంఛార్జి ఆకేపోగు ప్రభాకర్, కోడుమూరు మండల పార్టీ అధ్యక్షురాలు కోట్ల కవితమ్మ, రాష్ట్ర తెలుగుమహిళ అధికార ప్రతినిధి సి.బి.లత, పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు కె.ఈ.మల్లికార్జున గౌడ్, హేమంత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.