అమరావతి: తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండాలని టీడీపీ శ్రేణులకు పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ పిలుపు నిచ్చారు. తుఫాన్ నష్టం అపారంగా ఉందని, ఆపద సమయంలో ప్రజలకు తెలుగు దేశం శ్రేణులు అండగా నిల వాలని లోకేష్ సూచించారు. తుఫాన్ తీవ్రతపై వారం నుంచే కేంద్ర విపత్తు సంస్థలు హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షించక పోవడం దారుణమని విమర్శించారు. తుఫాన్‌పై అప్రమత్తం చేయడంలో నూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మండిప డ్డారు. ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వరద ప్రాంతాల్లో గడుపుతున్నారని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా, అధికారంలో ఉన్నా, లేకున్నా మానవతాదృక్పథంతో సహాయం చేసేది తెలుగుదేశం పార్టీ అని లోకేష్ తెలిపారు.