విజయవాడ: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన తనయుడు లోకేష్ వద్ద రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరా తీశారు. చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో అరెస్టయ్యి 52 రోజుల పాటు రాజ మండ్రి సెంట్రల్ జైలులో ఉండి అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చి హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రులైన ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ కూడా విజయ వంతంగా జరిగింది. మరోవైపు.. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ బృందం భేటీ అయ్యింది. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు, జగన్ సర్కార్ చేపడుతున్న కక్షపూరిత కార్యక్రమాల గురించి నిశితంగా గవర్నర్‌కు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, పీతల సుజాత, అశోక్‌బాబు వివరించారు. అనంతరం.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడ దన్న లక్ష్యంతో జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతు న్నారంటూ.. చంద్రబాబుపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల గురించి ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించారు.
ఈ భేటీలో భాగంగా చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు ఎలా ఉన్నారు..? బాబు ఆరోగ్యం ఎలా ఉంది..? అని నారా లోకేష్‌ను అడిగి తెలుసుకున్నారు. బాబు కోలుకుంటున్నారని లోకేష్, ఆయన బృందం వివరించింది. టీడీపీ నేతలు చెప్పిన విషయాలన్నింటినీ గవర్నర్ ఆసక్తిగా విన్నారు. నవ్వుతూనే అన్ని విషయాలను అబ్దుల్ నజీర్ విన్నారు. అనంతరం నారా లోకేష్‌తో పావు గంటపాటు ప్రత్యేకంగా గవర్నర్ మాట్లాడారు. అయితే ఏం చర్చించారన్న విషయం బయటికి రాలేదు. ఈ చర్చ తర్వాత లోకేష్ కోరిక మేరిక తన ఛాంబర్‌కు గవర్నర్ తీసుకెళ్లారు. ఈ భేటీ తర్వాత లోకేష్, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీసీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, చేస్తోన్న సామాజిక అన్యాయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.