హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు బాధాకరంగా ఉన్నాయని టీటీడీపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యకక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ప్రజలకు మంచి చేయవలసిన పాలకపక్షాలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయి? విద్యార్థుల భవిష్యత్తు పట్టకుండా వారి భవిష్యత్తు మీద, వారి ఆశలమీద నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు.
బాసర ఐఐఐటీలో త్రాగు నీటిని, విద్యుత్‌ను నిలిపివేయడం దారుణం. బాసరలోని త్రిపుల్ ఐటీ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు పడుతున్న అవస్థలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. త్రాగటానికి మంచినీళ్లు లేవు…. భోజన సౌకర్యాలు సరిగా వసతులు లేవన్నారు. కనీస వసతులు కల్పించి వారు చదువకునేందకు చక్కటి వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యయుల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ ఎస్ నాయకులు బాసర త్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని హెచ్చరించారు.