ముంబయి: ముంబయి పర్యటనలో భాగంగా అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్
ఎన్ఫీల్డ్’ లీడర్షిప్ బృందంతో మంత్రి లోకేష్ ముంబైలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ఆంధ్రప్రదేశ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రస్థానం ప్రస్తుతం ‘బుల్లెట్’ వేగంతో దూసుకుపోతోంది. ఈ రోజు ముంబైలో రాయల్ ఎన్ఫీల్డ్ నాయకత్వ బృందాన్ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధి బృందం మంత్రి నారా లోకేష్‌కు తమ సంస్థకు గుర్తుగా ఒక అందమైన ‘మినియేచర్
బుల్లెట్’ను జ్ఞాపికగా బహూకరించింది. ఈ సరికొత్త కానుకను అందుకోవడంపై లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.















