- నేటి నుంచి రెండురోజుల పాటు సమావేశాలు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి కొండపల్లి
అమరావతి(చైతన్యరథం): ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో గురు, శుక్రవారాల్లో జరుగుతున్న 18వ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొననున్నా రు. కేంద్ర విదేశీ వ్యవహార శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. విదేశీ వ్యవ హారాల మంత్రి ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సమా వేశంలో పాల్గొనవల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో పాల్గొనే నిమిత్తం మంత్రి శ్రీనివాస్ బుధవారం రాత్రి విజయనగరం నుంచి బయలుదేరి భువనేశ్వర్ వెళ్లనున్నారు. గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ‘‘ప్రవాస భారతీయ దివస్’’ కార్యక్రమం రెండురోజుల పాటు జరుగు తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసించే భారతీయ మూలాలున్న వారందరినీ ఏకం చేయడంతో పాటు, ఆయా దేశాల్లో భారతీయ సంతతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి తగిన పరిష్కారం కనుగొనడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న ప్రవాస భారతీ య ప్రముఖులు కూడా హాజరవుతారు. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఎదు ర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, భారతీయ సంతతిలో విదేశాలలో ఎక్కువగా నివసించే ప్రవాసాంధ్రులను ఏకతాటిపై తెచ్చేందుకు ఈ కార్యక్ర మం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత గల ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున తనకు పాల్గొనే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి కొండపల్లి ధన్యవాదాలు తెలిపారు.