నందికొట్కూరు: సీఎం జగన్రెడ్డి ముస్లిం మైనారిటీల వ్యతిరేకి అని నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. మైనారిటీ మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం అందించిన దుల్హన్ పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నందికొట్కూరులో ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.