తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి టీడీపీ నాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నాందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారని ఒక ప్రకటనలో బాలకృష్ణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు పోవాలని ఆశించారు. ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో రేవంత్ చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షించారు.