- హామీ ఏడాదికి 13,500.. కానీ ఇస్తున్నది 7,500
- ఒక్కో రైతుకు ఐదేళ్లలో రూ.30 వేల రూపాయల నష్టం
- 28 లక్షల మంది రైతులు,కౌలురైతులకు పూర్తిగా ఎగనామం
- రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకాలు రద్దు
- వడ్డీ రాయితీ పథకాలు నిర్వీర్యం
- పాడి రైతుల నోట్లో గడ్డి
గత నాలుగున్నరేళ్ల కాలంలో రైతులను, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన జగన్‌రెడ్డి రైతు భరోసా పేరుతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడిసాయం చేస్తున్నా నంటూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి జగన్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేశారు. ఎన్నికల సమయంలో ఒక్కొ రైతుకు ఏడాదికి ఒకేసారి 13,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తానని హామీనిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 7,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా మూడు విడతల్లో విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా ఐదేళ్ల కాలంలో ఒక్కొ రైతు దాదాపు 30వేల రూపాయలను నష్టపోయారు.
అమరావతి, చైతన్యరథం: గత నాలుగున్నరేళ్ల కాలంలో రైతులను, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి రైతు భరోసా పేరుతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నానంటూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి జగన్‌రెడ్డి రైతులను నిలువునా మోసం చేశా రు. ఎన్నికల సమయంలో ఒక్కొ రైతుకు ఏడాదికి ఒకే సారి 13,500రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తానని హామీనిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 7,500రూపాయలు మాత్రమే ఇస్తు న్నారు. అది కూడా మూడు విడతల్లో విడుదల చేస్తు న్నారు. ఈ కారణంగా ఐదేళ్ల కాలంలో ఒక్కొ రైతు దాదాపు 30వేల రూపాయలను నష్టపోయారు. జగన్ రెడ్డి తన హామీ మేరకు ఏడాదికి 13,500 ఇవ్వాల్సి ఉండగా, కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేల రూపాయలను తన ఖాతాలో వేసు కొని తాను హామీ ఇచ్చిన మేరకు మొత్తం పెట్టుబడి సహాయాన్ని ఇస్తున్నట్లుగా ఫోజు కోడుతున్నారు.కేంద్రం ఇస్తున్న నిధులను తాను ఇచ్చిన హామీకి అదనంగా ఇచ్చి రైతులకు ఆదుకోవాల్సి పోయి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రైతులను మోసం చేశారు. లబ్దిదారుల సంఖ్యలోనూ జగన్‌రెడ్డి రైతులను దగా చేశారు. ఎన్ని కలకు ముందు రైతులకు, కౌలురైతులందరికీ రైతు భరోసా అందిస్తానని చెప్పారు.కానీ ఆచరణలో మాత్రం వడపోత పోసి అనేక అంక్షలు పెట్టి 64 లక్షల మంది రైతులు ఉండగా దాదాపు 51 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారు. కౌలురైతులు రాష్ట్ర వ్యాప్తంగా 17లక్షల మంది ఉండగా కేవలం లక్షన్నర మందికి మాత్రమే పెట్టుబడిసాయం అందిస్తున్నారు. కౌలు రైతుల్లో అత్యధిక మంది అగ్రవర్ణాల పేదలు ఉండగా…వారికి ఈ పథకం వర్తించదంటూ షరతులు పెట్టి కౌలు రైతులను మోసం చేశారు.
అన్నదాత సుఖీభవ రద్దు చేసిన రైతు ద్రోహి
ఒకవైపు పెట్టుబడిసాయంలో తానిచ్చిన హామీని నెరవేర్చని జగన్‌రెడ్డి చంద్రన్న అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను, అన్నదాత సుఖీభవ పథకాలను రద్దు చేసి రైతు ద్రోహిగా మారారు. చంద్రన్న రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతలు అమలు చేసి ఉంటే ఒక్కొ రైతుకు రూ.40వేల రూపాయల లబ్ది చేకూరి ఉండేది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రైతుకు 15వేల రూపాయల సాయాన్ని అం దించి ఉంటే ఐదేళ్లలో ఒక్కొ రైతుకు 75వేల రూపా యల లబ్ది చేకూరేది. అంటే మొత్తం ఒక్కొ రైతుకు లబ్ది చేకూర్చాల్సిన లక్షా 15 వేల రూపాయల పథకాలను జగన్‌రెడ్ది రద్దు చేశారు. కానీ తానిస్తున్నది కేవలం 37,500 రూపాయలు మాత్రమే. అదే చంద్రబాబు పాలనా కాలంలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతులకు 21 వేల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చారు. చంద్రబాబు పాలనా కాలంలో ఈ పథకాలను 55 లక్షల మందికి అందించగా జగన్‌రెడ్డి మాత్రం 52 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు.
వడ్డీ రాయితీ పథకాల నిర్వీర్యం
రైతులకు ఎంతో మేలు చేసిన వడ్డీ రాయితీ పథకా లను కూడా జగన్ నిర్వీర్యం చేశారు. మూడు లక్షల రుణం వరకు ఉన్న పావలా వడ్డీ పథకాన్ని చంద్రబాబు అమలు చేస్తే దాన్ని జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారు. చంద్ర బాబు హయాంలో మూడు లక్షలకు ఏడాదికి ఆరు వేల రూపాయల వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. కానీ నేడు 12 వేల రూపాయల చెల్లించాల్సి వస్తోంది. అలాగే లక్ష లోపు రుణాలకు సకాలంలో చెల్లిస్తే సున్నా వడ్డీ వర్తింప జేసే పథకాన్ని చంద్రబాబు అమలు చేస్తే జగన్‌రెడ్డి దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. 2022-23 ఏడాదికి సంబంధించి రబీ పంట బీమా ప్రీమియం చెల్లించక పోవడంతో పెద్దఎత్తున రైతులు నష్టపోయారు.
పాడి రైతుల నోట్లో గడ్డి
జగన్‌రెడ్డి పాడి రైతులను పెద్ద ఎత్తున ఆదుకుంటా నని చెప్పి చివరికి వారి నోట్లో గడ్డి పెట్టారు. పాడి రైతులకు లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తామనే హామీ ప్రకారం నాలుగున్నరేళ్లలో రూ.1,250కోట్లు పాడి రైతులకు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. కేసుల మాఫీ కోసం సహకార డైయిరీల ఆస్తులతో పాటు ప్రభుత్వ ధనం రూ.6,000 కోట్లు అమూల్ కు ధారాదత్తం చేస్తున్నారు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి, మాట తప్పి నేడు ఆక్వా, నాన్ ఆక్వా జోన్ గా విడదీసి యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.85 వరకు వసూలు చేస్తూ ఆక్వారంగాన్ని దెబ్బతీశారు. చంద్రన్న పాలనలో వారంలోనే ధాన్యం బకాయిలు చెల్లింపులు చేయగా.. జగన్ రెడ్డి పాలనలో నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు. ధాన్యం సేకరణ తగ్గించారు. ఎంఎస్ పీకి తూట్లు పొడుస్తూ తరుగు, తేమ పేరుతో టన్నుకు సుమారు 3వేలు కోత కోస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు 90%, ఎస్సీ, ఎస్టీలకు 100% సబ్సీడీతో చంద్రన్న ప్రభుత్వం ఇచ్చిన డ్రిప్, స్ప్రింక్లర్లను రద్దు చేసి వాణిజ్య పంటల రైతులకు జగన్ రెడ్డి ద్రోహం చేశారు. చంద్రన్న రైతు రథం ద్వారా 23వేల ట్రాక్టర్లు ఇవ్వగా, జగన్ రెడ్డి ఇచ్చింది కేవలం 6వేలు మాత్రమే.
రైతు ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం
రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉంది.
ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉన్నట్లు జాతీయ గణాంక సర్వేలో తేలింది. రాష్ట్రంలోని రైతులపై రూ.1,91,970.26 కోట్ల రుణభారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఏ పంటకూ మద్దతు ధర లభించడం లేదు. ఆర్బీకేలు ఆర్బాటమే తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదు. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి విపత్తుల నిధి కింద ఆదుకుంటామని చెప్పి దగా చేశారు. ధాన్యం సేకరణను 35 లక్షల టన్నులకు కుదించారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రన్న రూ.68 వేల కోట్లు ఖర్చు చేయగా.. జగన్ రెడ్డి రూ.25వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసి సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. చంద్రన్న వ్యవసాయాన్ని పండగ చేయగా, జగన్ రెడ్డి రైతును నయవంచనకు గురి చేశారు.