అమరావతి: రాష్ట్రంలో మైనారిటీలకు అందని సంక్షేమ పథకాలు, బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు ఉపాధి లేక పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు, పెరిగిన దాడులు, ముస్లిం మహిళలకు రక్షణ కరువు, యువతకు ఉన్నతవిద్య దూరం, రంజాన్ తోఫా, దుల్హన్ పథకం పునరుద్ధరణ వంటి అంశాల గురించి.. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ శాసనసభ్యులు, శ్రీ అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు.
ముఖ్యమైన అంశాలు :
★ గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వం నుంచి పైసా కూడా సాయం అందక వారు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోంది.
★ అందుకే వారి సమస్యలను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
★ 2019 ఎన్నికల ప్రచారంలో మైనారిటీలను ఉద్దరిస్తానని మీరు హామీల వర్షం కురిపించారు.
★ తీరా అధికారంలో వచ్చాక ఏం చేశారు? కనీసం వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో ఏనాడైనా పట్టించుకున్నారా?
★ ముస్లింలను కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్నారన్నది వైసీపీ ప్రభుత్వ చర్యలతో స్పష్టమైంది.
★ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో, మన సమాజంలో భాగమైన మైనారిటీలకు మీ పాలనలో ఒరిగిందేమిటి?
★ సంక్షేమ పథకాలు అందక ఎన్నో ముస్లిం కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి.
★ పూట గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధలు మీకు కనిపించవా? మీది ముమ్మాటికీ ముస్లిం వ్యతిరేక ప్రభుత్వమే.
★ టీడీపీ హయాంలో మైనారిటీల కోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే ఇప్పుడేమో నామమాత్రంగా కేటాయిస్తూ వాటినీ ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లించడమనేది ముస్లింల అభివృద్ధిపై మీకున్న చిత్తవృద్ధికి నిదర్శనం.
★ టీడీపీ హయాంలో మైనారిటీల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ నిలిపేయడం దారుణమైన చర్య.
★ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా పండుక చేసుకోవాలనే మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా ఆపేసింది.
★ ముస్లిం వధువుకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా ఆ కుటుంబాలకు అండగా నిలిచిన దుల్హన్ పథకానికీ మంగళం పాడారు.
★ హజ్ యాత్రకూ సాయం అందడంలేదు.
★ మైనారిటీ యువతకు ఉన్నతవిద్యను దూరం చేసి వారి భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేశారు.
★ టీడీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన విదేశీ విద్యను రద్దుచేసి విదేశాల్లో చదువుకుంటున్న వందలాదిమంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేశారు.
★ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం టీడీపీ హయాంలో తెచ్చిన దుకాన్, మకాన్ వంటి పథకాలనూ అర్ధాంతరంగా నిలిపేశారు.
★ మూడేళ్లుగా స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీ జరగడం లేదు.
★ షాదీఖానాలకు నిధులు కేటాయించికపోవడం, ప్రార్థనా మందిరాల మరమ్మతులకు పైసా కూడా ఇవ్వకపోవడం మైనారిటీలకు ద్రోహం చేయడం కాదా?
★ ప్రభుత్వ చేతకానితనం వల్ల రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ కరువైంది.
★ మూడేళ్లుగా ముస్లింలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం ఒక్కరినైనా శిక్షించిందా? బాధితులను ఆదుకున్నారా?
★ నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, పలమనేరు విద్యార్థిని మిస్బా ఆత్మహత్య, కర్నూలు జిల్లా గోనెగుండ్లలో బాలిక హజీరాపై అత్యాచార ఘటనల్లో ఎటువంటి.
★ చర్యలు తీసుకోకపోవడం మైనారిటీలపై వైసీపీ ప్రభుత్వ చిన్నచూపుకు నిదర్శనం.
★ 3 ఏళ్లలో ముస్లీం ఆడబిడ్డలపై 46 దాడి ఘటనలు జరిగినా నేటికీ ప్రభుత్వం అందుకు కారణమైన వారిని అరెస్ట్ చేయకపోవడం దేనికి సంకేతం?
★ రాష్ట్రంలో మైనారిటీలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవు.
★ తెలుగుదేశం హయంలో గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గంలోని దాచేపల్లిలో మైనార్టీలపై దాడికి పాల్పడిన వ్యక్తిపై 24 గంటలలో చర్యలు తీసుకుంటే మీరు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై పాలన చేయడం దారుణం.
★ రెక్కల కష్టం మీద ఆధారపడి జీవించే ముస్లిం సోదర కుటుంబాలు ప్రభుత్వ వివక్ష కారణంగా మూడేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
★ ప్రభుత్వ పథకాలు అందక, ఆర్థిక సాయం కరువై మరింత పేదరికంలోకి జారిపోతున్నారు.
★ మైనారిటీల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు సరికాదు.
★ ప్రభుత్వం వెంటనే రంజాన్ తోఫా, విదేశీ విద్య, దుల్హన్ పథకాలను పునరుద్ధరించాలి.
★ ప్రార్థనా మందిరాలు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలి.
★ ముస్లింలకు ఆర్థిక చేయూత అందించాలి. యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలి.