ధర్మవరం : రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు మితిమీరిపోయాని, వీరికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాలశ్రీరామ్ పేర్కొన్నారు. పట్టణం లోని పేటలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుమహిళా నాయకురాళ్లు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభు త్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులపై పెంచిన ధరల గురించి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో విధంచని విధంగా చెత్త పై పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారని పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. చేనేతలకు టీడీపీ హయాం లో అనేక పథకాలు అందించామన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ చేనేతలకు గుప్పించిన హామీ లు నేటికీ అమలు పరచడం లేదన్నారు. చేనేతలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కాచర్ల కంచన టీడీపీ జడ్పీటీసీ మేకల రామాంజ నేయులు, నాయకులు చిగిచెర్ల ఓబిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కమతంకాటమయ్య, మాజీ జడ్పీచైర్మన్ బోయ రవిచంద్ర, పురు షోత్తంగౌడ్, చింతపులుసు పెద్దన్న, పరిశే సుధాకర్, భీమనేని ప్రసాద్ నాయుడు, గరుగు వెంగప్ప, రుద్రారవి, అంబటిసనత్, క్రిష్ణాపురం జమీర్ అహమ్మద్, రాంపురంశీన, గంగారపు రవి, నాగూర్ హుస్సేన్, బాబూఖాన్, చిగిచెర్ల రాఘవరెడ్డి, బొట్టుకిష్ణ, గోసల శ్రీరాములు, చిన్నూరు విజయ్ చౌదరి, సంగాల బాలు, చీమల రామాంజి, అత్తర్ రహీంబాషా, చీమల నాగరాజు, పూలకుంట్ల మహేశ్, కేతినేని రాజు, సత్యనారాయణ, ఓంకార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.