పుట్టపర్తి: వైసీపీ అంటే రైతు వ్యతిరేక పార్టీ అనే పేరు ముద్ర పడిపోయిందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. పుట్టపర్తి నియోజకవర్గానికి పంటల బీమా మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో నల్లమాడ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి రైతులు, టీడీపీ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పంటల బీమా మంజూరు చేయాలని కోరుతూ నల్లమాడ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జగన్ ఒక్క అవకాశంతో రైతులను నట్టేట ముంచాడన్నారు. అన్ని వర్గాలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశాడన్నారు. రైతులకు పంట బీమా రాక తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఎమ్మెల్యే, మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లే ధైర్యం కూడా లేదన్నారు. వైసీపీ పాలనలో భూకబ్జాల చరిత్ర మొదలైందన్నారు. ఈ ధర్నాలో ఆరు మండలాల టీడీపీ మండల కన్వీనర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి పంటల బీమా మంజూరు చేయాలని కోరుతూ మండల తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.