14400 కాదు… 6093 అని
యాప్ అయితే కరెక్ట్ గా ఉండేది!
నేతిబీర కబుర్లు మానండి జగన్ రెడ్డీ!
నారా లోకేష్ ట్వీట్
అమరావతి: దేశంలోనే అత్యంత అవినీతిపరుడిగా పేరొంది సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌రెడ్డి అవినీతిని అరికడదామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేస్తూ యాప్‌కి 14400 నెంబర్ కాకుండా, 6093 అయితే బాగుండేది. అవినీతి చూస్తూ ఉండొద్దు. అవినీతి గురించి వింటూ ఉండొద్దు… అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తోన్న అవినీతి అనకొండ జగన్ రెడ్డి గారూ అవినీతిపై ఈ నేతిబీర కబుర్లు మాని.. మీపై ఉన్న అవినీతి కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా అని లోకేష్ ప్రశ్నించారు.