- వరద బాధితులు చంద్రబాబుకు రుణపడి ఉన్నారు
- జగన్‌రెడ్డి రాజకీయం చేయడం దుర్మార్గం
- ఆయన రూ.కోటి ఎవరికి ఇచ్చారో చెప్పాలి
- సీఎంవో కేంద్రంగానే జెత్వానీపై వేధింపులు
- పీఎస్‌ఆర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాలి
- టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న
విజయవాడ(చైతన్యరథం): విపత్తు సమయంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు పనితీరు ఆదర్శనీయమని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెం కన్న కొనియాడారు. బుద్దా వెంకన్న కార్యాలయంలో బుధవారం చంద్రబాబు చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. మా బాబు బంగారం అంటూ కార్యకర్తలు, వరద బాధితులు నినా దాలు చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ విపత్తు సమయంలో బాధి తులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు పనితీరు ఆదర్శనీయమని కొనియాడారు. వరద బాధితులకు రూ.25 వేలు సాయం ప్రకటించడం ఎక్కడా లేదన్నారు. నిద్రాహారాలు మాని వరద బాధితులు కోలుకునేంత వరకు పనిచేసిన సీఎం చంద్రబాబుకు విజయవాడ నగర, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారని, దీనిని కూడా జగన్ రెడ్డి రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కోటి రూపాయలు జగన్ ఎవరికి ఇచ్చాడో చెప్పాలని ప్రశ్నిం చారు.
సీఎంవో కేంద్రంగానే జెత్వానీపై వేధింపులు
సీఎంవో కేంద్రంగానే ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటిని చిత్రహింసలు పెట్టా రని విశాల్ గున్నీ స్టేట్‌మెంట్‌ను బట్టి తెలుస్తుంది. జగన్ ఆదేశాలను పీఎస్‌ఆర్ ఆంజనే యులు అమలు చేశారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారు. గతంలో కూడా పి.ఎస్.ఆర్.ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులు పెట్టాడు. డీసీపీ రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. గున్నీ రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులును అరెస్టు చేసి పోలీసు కస్టడీలోకి తీసుకోవాలి. అతన్ని విచారిస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తాయి. సీఎంవోలో జగన్ పాత్ర కూడా వెలుగులోకి వస్తుంది. తప్పు చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలి. పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించాలి. ఆనాడు జగన్ చెప్పినట్లు మాట్లాడిన అధికారులు, పోలీసుల నిర్వాకంపై మాట్లాడరా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు, నారా లోకెష్‌లను అనేక సార్లు అడ్డుకున్నారు. కక్షపూ రితంగా చేసిన ఆనాటి అధికారులు పాత్రపై విచారణ చేయించాలని కోరారు.
టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.50 వేల సాయం
ఇటీవల వరద ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపడుతూ గుండెపోటుకు గురై టీడీపీ సీనియర్ కార్యకర్త కిల్లాని దుర్గారావు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి చింతిస్తూ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గ టీఎన్‌టీయూసీ గౌరవాధ్యక్షుడు కాండ్రేగుల రవీంద్ర చేతులమీదగా దుర్గారావు కుటుంబసభ్యులకు రూ.50 వేల ఆర్థిక సహాయం అంద జేశారు. ఈ కార్యక్ర మంలో 44వ డివిజన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, కామ దేవరాజ్, పునుగుపాటి చిన్న సుబ్బయ్య, పత్తి నాగేశ్వరరావు, రేగళ్ల లక్ష్మణరావు, పల్లంటి గంగాధర్, గంగాధర్‌రెడ్డి, బడుగు గణేష్, తదితరులు పాల్గొన్నారు