- ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
- ఎక్స్‌లో వెల్లడిరచిన సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఎన్టీపీసీ- ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(ఏపీ నెడ్‌క్యాప్) మధ్య ఒప్పందం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనిలో భాగంగా 2025 నాటికి ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ఫలకాలను అమర్చనున్నట్లు సీఎం తెలిపారు. 25 ఏళ్లపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం వల్ల చౌకగా సౌర విద్యుత్ అందబాటులోకి వస్తుందన్నారు. 25ఏళ్ల పాటు కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశం కూడా ఉందని ఆయన వెల్లడిరచారు. ప్రతి ఏటా 3.41లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున 25ఏళ్లలో 85.25లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే 300 మెగావాట్ల విద్యుత్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఏటా రూ.118.27 కోట్లు, 25 ఏళ్లపాటు సుమారు రూ.2,957 కోట్ల మేర ఆదా అవుతుందని వెల్లడిరచారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.