- మంత్రి లోకేష్‌కు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందన
- తొలి 10 స్థానాల్లో నిలిచిన ఎమ్మెల్యేలు, నేతలకు ప్రశంసలు
- శాశ్వత సభ్యత్వ డబ్బుతో కార్యకర్తల కుటుంబాలకు సాయం
- పొలిటికల్ గవర్నెన్స్‌తో కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతాం
- మన రాజకీయం ప్రజల కోసమే..చేసిన మంచిని వివరిద్దాం
- సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- సాగునీటి ఎన్నికల్లోనూ గెలుపునకు కృషిచేయాలని పిలుపు
అమరావతి(చైతన్యరథం): ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదులో మొదటి 10 స్థానాల్లో నిలిచిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులను అభినందించారు. తక్కువ సమయం లోనే రికార్డు స్థాయిలో 52 లక్షల సభ్యత్వాలకు చేర్చడంపై ప్రత్యేకంగా మంత్రి లోకేష్‌కు అభినందనలు తెలిపారు. పార్టీ సభ్యత్వాన్ని గత నెల 26న ప్రారంభించగా ఇప్పటికీ 52.45 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం తీసుకోవడం ఒక చరిత్రగా అభివర్ణించారు. రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, ఆత్మకూరు, మంగళగిరి, కనిగిరి, కోడూ రు, వినుకొండ, కావలి నియోజకవర్గాలు టాప్ 10లో ఉన్నాయి.. తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు వేగం పుంజుకుంటోందని తెలిపారు.
కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం
రూ.లక్షతో శాశ్వత సభ్యత్వ విధానం మొదటిసారి తెచ్చాం..దీనికి కూడా అనూహ్య మైన స్పందన వస్తోంది. శాశ్వత సభ్యత్వ రుసుము ద్వారా వచ్చే నగదుతో నిరుపేద కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం. గతంలో రూ.100లతో రూ.2 లక్షలు బీమా ఉండేది.. ఇప్పుడు దానిని రూ.5 లక్షలకు పెంచాం. రాబోయే రోజుల్లో కార్యకర్తలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొస్తాం. ఐదేళ్లలో పార్టీ కేడర్‌కు రూ.140 కోట్లు బీమా, ఆరోగ్యం, విద్య కోసం సాయం అందించాం. అన్నివిధాలా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిన పెడుతూనే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం. సరైన మనిషిని..సరైన చోట ఉంచుతామన్న మాటకు కట్టుబడి పార్టీ కోసం శ్రమించిన వారిని పదవుల్లో నియమిస్తున్నాం.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో పనిచేశారు. గత అరాచక పాలనలో మన కార్యకర్తలు ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్నా రు. అయినా భయపడకుండా పోరాటం చేయడం వల్ల 57 శాతం ఓట్లతో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి విజయం సాధించింది. ఓడిపోయిన 11 సీట్లు కూడా అతి తక్కువ మెజారిటీతో ఓడామని గుర్తుచేశారు. కొత్తగా పొలిటికల్ గవర్నెన్స్ విధానం తీసుకొ చ్చాం. పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేసి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతా మని చెప్పారు. టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమి స్తామని తెలిపారు.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయానికి కృషిచేయాలి
త్వరలో సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రోడ్ల మరమ్మతులకు రూ.1400 కోట్లు మంజూరు చేశాం..సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్క డా రోడ్లపై గుంతల్లేకుండా చేస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా ముందుకెళుతున్నాం..మనం చేసే రాజకీయం కేవలం ప్రజల కోసమే.. ప్రజల ను చైతన్యవంతం చేస్తూ మనం చేస్తున్న మంచి కార్యక్రమాలను వివరించాలని సూచిం చారు. ఇది సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం..అభివృద్ధికి నాంది పలుకుతున్నాం.. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు. గత ఐదేళ్లు విచ్చలవిడితనంతో ఎక్కడికక్కడ భూ సమస్యలు సృష్టించారని, త్వరలోనే రెవెన్యూ సదస్సు లు నిర్వహించి పరిష్కరిస్తామని వెల్లడిరచారు.