తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మజిలీ పూర్తి చేసుకుంది. ప్రతి వంద కిలోమీటర్ల కు ఒక శాశ్వత ప్రాయోజిత పథకాన్ని ప్రకటిస్తున్న లోకేష్ 700 కిలోమీటర్ల మైలు రాయి పూర్తి చేసుకున్న సందర్భంగా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించారు. పెనుకొండ నియోజకవర్గం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మజిలీ పూర్తయింది.
యువగళం జన ప్రభంజనం లా సాగుతున్నది.700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోరంట్ల మండలం, మడకశిర ప్రాంతాల తాగు, సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి పునాది వేశారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.