Telugu Desam

శ్రీ నందమూరి తారక రామారావు గారు (అన్న ఎన్టీఆర్)

ఎన్టీఆర్...

ఈ పేరు వింటేనే ప్రతి తెలుగు హృదయానికి ఒక పరవశం. మొన్నటి తరానికి సినీ కథానాయకునిగా… నిన్నటి తరానికి ప్రజానాయకునిగా… నేటి తరానికి ఒక యుగపురుషుడిగా… తరతరాలను తన్మయులను చేసే శక్తి నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు మూడు తరాలకు స్ఫూర్తినిచ్చిన మంత్రాక్షరాలు. రాబోయే తరాలకు చారిత్రక అద్భుతాలు.
సినీ నటునిగా ఎన్టీఆర్ పోషించిన పురాణ పురుషుల పాత్రలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాయి. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, శివుడు, రావణుడు, దుర్యోధనుడు, భీముడు వంటి పౌరాణిక పాత్రలలో ఎన్టీఆర్ ను చూసిన తెలుగువారు ఆ పాత్రలను పోషించడానికి పుట్టిన ‘కారణజన్ముడు’ ఎన్టీఆర్ అన్నారు. మరికొంతమంది ఎన్టీఆర్ ను నడిచే దేవుడుగా భావించారు. భారతదేశంలో లబ్దప్రతిష్టులైన సినీ నటులు ఎందరు ఉన్నా… తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని సంపాదించుకుని ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ’ అనిపించుకున్నారు ఎన్టీఆర్. తొలి చిత్రం ‘మనదేశం’ (1949) నుండి చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్'(1993) వరకు (చివరిగా విడుదలైన చిత్రం ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’) నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే మరియు కథా రచయితగా రాణించిన నటరత్న ఎన్టీఆర్… పద్మశ్రీ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులను కైవసం చేసుకున్నారు. 
 
సినిమాల్లోకి రాకముందు ముంబైలో నెలరోజులపాటు మెస్ నడిపారు ఎన్టీఆర్. కొన్నాళ్ళు పొగాకు వ్యాపారం చేసారు. మరి కొన్నాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నడిపి నష్టపోయారు.  ఇంటర్ చదివేటప్పుడే కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారు.  మిలిటరీ సర్వీసులో చేరే అవకాశం వస్తే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సబ్‌ రిజిస్ట్రార్‌ గా ప్రభుత్వ ఉద్యోగం వస్తే అక్కడి పరిస్థితులతో రాజీపడలేక తనకు తానుగానే ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వెళ్లారు ఎన్టీఆర్. ఆ నిర్ణయమే ఒక మహోజ్వల చరిత్రకు శ్రీకారం చుట్టింది.     
ఇక ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం ఒక ప్రభంజనం. ఆయన నోట ప్రతిధ్వనించిన ఆత్మగౌరవ నినాదం ఒక బ్రహ్మాస్త్రం. “నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ” అంటూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగు వారికి  స్వర్ణయుగపు వైభవాన్ని ఇచ్చింది. దేశ రాజకీయాలలో సమూల మార్పులు తెచ్చింది. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తెచ్చింది. బడుగులకు అధికారాన్ని ఇచ్చింది. స్త్రీలకు సాధికారతను ఇచ్చింది.  దేశంలో జన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. 
 
 ప్రజల్లోకి వెళ్లి ఏ బేధభావమూ లేకుండా పేదలు, బడుగుల భుజాలపై చేయివేసి… “నీ బాధ తీర్చేందుకే అన్నీ వదులుకుని వచ్చాను” అన్న ఎన్టీఆర్ ను ‘అన్నా’ అని పిలిచారు జనం. సినీ జీవితం ఎన్టీఆర్ ను రాముడుగానో, కృష్ణుడుగానో ప్రతి ఇంటా ఫోటో రూపంలో చూపిస్తే… రాజకీయ జీవితం ఆయనకు ప్రతి తెలుగు హృదయంలో ఏకంగా గుడినే కట్టింది.  

'అన్న' ఎన్టీఆర్ జీవిత విశేషాలు:

బాల్యము - విద్యాభ్యాసం :

ఎన్టీఆర్ సినీరంగ ప్రస్థానం:

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం - తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం :

తెలుగునాట రామరాజ్య పాలన ప్రారంభం:

తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారు. ఎన్టీఆర్‌ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టడమన్నది వెండి తెర చేసుకున్న మహద్భాగ్యం. అక్కడితో ఆగిపోకుండా రాజకీయాల్లోకి వచ్చి తెలుగు నేలకు, జాతికీ ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడమే కాకుండా తెలుగు ప్రజలకు 'సేవ చేసే రాజకీయాల'ను పరిచయం చేసారు ఎన్టీఆర్.

2023 మే 28వ తేదీ శక పురుషుడు ఎన్టీఆర్ శత జయంతి రోజు. ఆ రోజుకు ఏడాది ముందు నుంచే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది తెలుగుదేశం.

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist