ఎన్నో త్యాగాలతో, మరెంతో దీక్షతో, రక్తతర్పణం చేసి స్వరాజ్యాన్ని సాధించుకుంది భరత జాతి. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో తెలుగు వీరులు సైతం వీరకిశోరాలై పోరాడారు. తెలుగునాట దేశభక్తులకు, సాహస వీరులకు కొదవే లేదని చాటారు.
మన్యం ప్రజలను సంఘటితపరచి ఒక్కొక్కరినీ ఒక్కొక్క వీరుడుగా తీర్చిదిద్ది తెల్లదొరల గుండెలదరగొట్టిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు... గుండెను తుపాకీ గుండ్లకు ఎదురొడ్డిన 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం... చీరాల-పేరాల సత్యాగ్రహ సారథి 'ఆంధ్రరత్న' దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, 'దేశభక్త' కొండా వెంకటప్పయ్య, 'దేశోద్ధారక' నాగేశ్వరరావు, 'రైతు బాంధవుడు' ఆచార్య రంగా... స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు వంటి యోధానుయోధులు ఎందరో తెలుగు నేలపై నిలిచి స్వతంత్ర భారతావని కోసం జీవితాలను అంకితం చేసారు
అటువంటి మహానుభావుల మహత్తర త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలం ఆసేతు హిమాచలం అందరికీ సమానంగా దక్కాలి అన్నదే తెలుగుదేశం ఆకాంక్ష.
న్యాయబద్ధమైన ప్రాంతీయ అవసరాల కోసం, హక్కుల కోసం పోరాడుతూనే... సుదృఢమైన దేశ నిర్మాణం కోసం జాతీయ వాద నిబద్ధతతో కృషిచేసిన పార్టీ తెలుగుదేశం. కాబట్టే జాతీయ రాజకీయాలలో కీలక మలుపులకు కారణమై దేశ ప్రధానులను, రాష్ట్రపతులను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషించింది తెలుగుదేశం. దేశానికి తొలి దళిత స్పీకర్ ను అందించి దళితాభ్యుదయ స్ఫూర్తిని దేశానికి అందించింది. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో, సంస్కరణలతో, ప్రజా చైతన్యం, జనాభ్యుదయం సాధించిన పార్టీగా దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశ రాజకీయాలకు సమాఖ్య స్ఫూర్తిని గుర్తుచేసింది తెలుగుదేశం. ప్రాంతీయ తత్వంతో ఏనాడూ సంకుచిత రాజకీయాలు చేయదు తెలుగుదేశం.
తెలుగుదేశం అంటే జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం ఆకాంక్ష ఒక్కటే. తెలుగు జాతి సర్వతోముఖ సమున్నతిని సాధించాలి. తెలుగువాడు దేశానికి గర్వకారణం కావాలి.
© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.